నాగార్జునకొండ కార్యాలయంలో మ్యూజియం డే వేడుకలు | - | Sakshi
Sakshi News home page

నాగార్జునకొండ కార్యాలయంలో మ్యూజియం డే వేడుకలు

May 19 2026 1:40 AM | Updated on May 19 2026 1:40 AM

విజయపురిసౌత్‌: స్థానిక నాగార్జునకొండ కార్యాలయంలో అంతర్జాతీయ మ్యూజియం డే వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. మ్యూజియం క్యూరేటర్‌ కమల్‌హాసన్‌ మ్యూజియం డే విశిష్టతను, మ్యూజియంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అమరావతి సర్కిల్‌ సూపరింటెండెంట్‌ ఆర్కియాలజిస్ట్‌ దేవాంఽద్రనాఽథ్‌ బోయి నాగార్జునకొండ మ్యూజియంలో రాబోయే రోజులలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఆర్కియాలజిస్ట్‌ దేవాంఽద్రనాథ్‌ బోయి, సీఆర్‌పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ జయచంద్రనాయుడు, మిర్యాలగూడ గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శివకృష్ణ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో పురావస్తుశాఖ డీఈ సాంబశివరావు, సీనియర్‌ సీఏ ఢాకారెడ్డి, ఎస్‌ఎస్‌ఏ ధనలక్ష్మి, హెచ్‌ఏ వెంకటనరేష్‌, సీఏ మల్లికార్జున, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement