పోస్టర్ ఆవిష్కరించిన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
లక్ష్మీపురం(గుంటూరువెస్ట్): ప్రగతి శీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ)రాష్ట్ర 9వ మహాసభలు ఈనెల 23.24 తేదీల్లో గుంటూరు నగరంలోని రెవెన్యూ కల్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు ఎం.లక్ష్మి ప్రధాన కార్యదర్శి బి.పద్మ పేర్కొన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని ఎస్‌హెచ్‌ఓలో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తొలుత రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ మహిళలపై ఇంటా, బయట చూపుతున్న వివక్ష, అణిచివేత, పీడన, హింసలకు వ్యతిరేకంగా ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) దేశవ్యాప్తంగా పనిచేస్తుందన్నారు. మహిళా దృక్పథంతో పోరాడి సాధించిన హక్కుల్ని, చట్టాల్ని అమలు చేయాల్సిన ప్రభుత్వం మహిళా సంస్కరణ పేరుతో వాటిని నిర్జీవం చేస్తుందని విమర్శించారు. ఉన్న హక్కులు నిలబెట్టుకొని, లేని హక్కులు సాధించుకునేందుకు (పీవోడబ్ల్యూ) భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని రాష్ట్ర మహాసభల్లో రూపొందిస్తామని చెప్పారు. మహాసభలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో ప్రగతిశీల మహిళా సంఘ ఉపాధ్యక్షులు ఎన్.విష్ణు ఆర్. గంగాభవాని రాష్ట్ర నాయకులు కె.దుర్గ, శివపార్వతి, బాజీ, గీత తదితరులు పాల్గొన్నారు.
లైంగికదాడికి పాల్పడిన
యువకుడిపై పోక్సో కేసు
తెనాలిరూరల్: బాలికను మాయ మాటలతో ప్రలోభ పెట్టి లైంగికదాడికి పాల్పడిన యువకుడిపై కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.... మండలంలోని హాఫ్‌పేట గ్రామానికి చెందిన బాలస్వామి ఓ బాలికతో తరచూ మాట్లాడుతూ మాయ మాటలతో ప్రలోభ పెట్టాడు. బాలికపై లైంగికదాడి చేయడంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా బాలస్వామిపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం తెనాలి వైద్యశాలకు తరలించారు.


