మెరిట్‌కు అన్యాయం చేస్తున్న డీఈఓపై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మెరిట్‌కు అన్యాయం చేస్తున్న డీఈఓపై చర్యలు తీసుకోవాలి

May 19 2026 1:40 AM | Updated on May 19 2026 1:40 AM

నరసరావుపేట: నిబంధనలు అతిక్రమించి మెరిట్‌కు అన్యాయం చేస్తున్న జిల్లా విద్యాశాఖాధికారిపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు కోరారు. సోమవారం పీజీఆర్‌ఎస్‌లో జిల్లా డీఆర్‌ఓ నారదమునికి వినతిపత్రం సమర్పించారు. జిల్లా కన్వీనర్‌ కోట సాయికుమార్‌ మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమగ్ర శిక్షకు చెందిన జీసీడీఓ, ఏఎల్‌ఎస్‌సీఓ పోస్టుల డిప్యుటేషన్‌పై భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చారన్నారు. సదరు పోస్టులకు సంబంధించి మెరిట్‌ లిస్టులు మే ఒకటిన సిద్ధమైనప్పటికీ డీఈఓ నిబంధనలకు విరుద్ధంగా అర్హతలేని అభ్యర్థులకు అదనపు మార్పులు కలపాలనే దుర్బుద్ధితో మెరిట్‌ లిస్టులను కలెక్టర్‌ కార్యాలయానికి పంపకుండా ఆపేశారన్నారు. 10రోజుల జాప్యం తరువాత తాను నిర్ణయించుకున్న అభ్యర్థులకు అర్హత లేకున్నా కమిటీపై ఒత్తిడి తెచ్చి అదనపు మార్కులు కలిపారన్నారు. డిస్ట్రిక్‌ రిసోర్స్‌పర్సన్‌ ట్రైనింగ్‌ ఇచ్చిన అభ్యర్థులకు మాత్రమే అదనపు మార్కులు కలపాల్సిన అవసరం ఉండగా డీఈఓ తాను ఎంచుకున్న అభ్యర్థులకు డీఆర్‌పీ ట్రైనింగ్‌ సర్టిఫికేట్‌ లేకున్నా అదనపు మార్పులను కలిపి ఆ లిస్టులను కలెక్టర్‌ కార్యాలయానికి పంపారన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మస్తాన్‌, విశ్వనాథ్‌ పాల్గొన్నారు.

పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం సమర్పించిన

ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

Advertisement
 
Advertisement
Advertisement