స్వాగతం పలికిన గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి
మాచర్ల: చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో జైలుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన నాయకుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి శుక్రవారం బెయిలుపై విడుదలయ్యారు. ఈ సందర్భంగా మాచర్ల నియోజక వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో వాహనాలలో వెళ్లి ఆయనకు ఘన స్వాగతం పలికారు. గుంటూరు నుంచి మాచర్ల వరకు ఆయన వెంట వందల మంది కార్లు, ద్విచక్ర వాహనాలతో వచ్చారు. పీవీఆర్‌కు జేజేలు పలుకుతూ వెంట సాగారు. మాచర్ల శివారులో బారికేడ్లు పెట్టి మరీ భారీ కాన్వాయ్‌ని పట్టణంలోకి రానివ్వబోమని అర్బన్ సీఐ వెంకటరమణ పేర్కొన్నారు. అనుమతించిన వాహనాలతోనే ర్యాలీగా ఆయన పట్టణానికి వచ్చారు. గుంటూరు నుంచి మార్గమధ్యలో పలు చోట్ల ఆయనకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎటుచూసినా కార్యకర్తల సందడి నెలకొంది. అందరికీ పీవీఆర్ అభివాదం చేస్తూ ముందుకుసాగారు. మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల, మాచర్ల రూరల్, దుర్గి, కారంపూడికి చెందిన వందల మంది ఆయనకు స్వాగతం పలికారు. ఎటుచూసినా టపాసులు పేలుస్తూ పీవీఆర్‌కు జేజేలు అంటూ ముందుకు సాగారు. పట్టణ శివారులో పోలీసులు ఎవరినీ లోనికి అనుమతించలేదు. ఇంటికి చేరుకోగానే పీవీఆర్‌ను అర్చకులు ఆశీర్వదించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సోదరుడు ఇంటికి రావటంతో పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాతృమూర్తి రాములమ్మ, కుటుంబ సభ్యులు ఆప్యాయంగా పలకరించారు. యోగ క్షేమా లు తెలుసుకున్నారు.
పీవీఆర్‌ను కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర మాజీ అధ్యక్షులు మేరాజోత్ హనుమంతునాయక్, మున్సిపల్ మాజీ చైర్మన్‌లు బత్తుల ఏడుకొండలు, అబ్దుల్ జలీల్, మార్కెట్ యార్డు చైర్మన్ తాడి వెంకటేశ్వరరెడ్డి, పట్టణ అధ్యక్షులు పోలా శ్రీను, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ యరబోతుల శ్రీనివాసరావు, యాదవ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ కామనబోయిన కోటయ్య, లెదర్ పార్కు రాష్ట్ర మాజీ డైరెక్టర్ బూదాల మరియమ్మ, జిల్లా కార్యదర్శి పోతురెడ్డి కోటిరెడ్డి, రాష్ట్ర యువజన విభాగ సంయుక్త కార్యదర్శి నవులూరి చెన్నారెడ్డి, జిల్లా యువజన సంఘం నాయకులు దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చిలుకూరి చంద్రశేఖర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు మల్లుస్వామి, యువజన విభాగ అధ్యక్షుడు బూడిద శ్రీను, పల్నాడు జిల్లా వ్యవసాయ సలహా మాజీ చైర్మన్ కుర్రి సాయి మార్కొండా రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు నవులూరి భాస్కర్‌రెడ్డి, పార్టీ మండలాల అధ్యక్షులు కొంగర సుబ్రహ్మణ్యం, ఉన్నం వెంకటేశ్వర్లు, కొండా శివలింగరాజు, గొట్టం బ్రహ్మారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు కేతావత్ బాలునాయక్, వార్డు కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు ఉన్నారు.


