మరో దోపిడికీ రంగం సిద్ధం చేస్తున్న చంద్రబాబు సర్కారు | - | Sakshi
Sakshi News home page

మరో దోపిడికీ రంగం సిద్ధం చేస్తున్న చంద్రబాబు సర్కారు

Mar 30 2026 8:37 AM | Updated on Mar 30 2026 8:37 AM

మళ్లీ తెరపైకి స్మార్ట్‌ కిచెన్లు

న్యూస్‌రీల్‌

అనుయాయుల జేబులు నింపేందుకు చంద్రబాబు సర్కార్‌ కుట్ర ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 13 పాఠశాలల్లో ఏర్పాటుకు చర్యలు ఆందోళన వ్యక్తం చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు

విద్యార్థులకు ఇక చల్లని భోజనమే దిక్కు

సోమవారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2026
రేపటి నుంచి శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు

సత్తెనపల్లి: ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయినా .. కనీస వేతనం లేకపోయినా అప్పులు చేసి అన్నం, కూరలు తయారు చేస్తున్నారు. విద్యార్థుల కడుపు నింపి ఆకలి తీర్చుతున్నారు. అలాంటి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పొట్ట కొట్టేందుకు స్మార్ట్‌ కిచెన్ల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మధ్యాహ్న భోజనం పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టారు. దీని ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందించాల్సింది పోయి తమ అనుయాయులకు మేలు జరిపేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమవుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయోగాత్మకంగా అమలు చేసిన వైఎస్సార్‌ కడప జిల్లాలో విజయవంతమైందంటూ 2025 డిసెంబర్‌లో హడావుడి చేశారు. మళ్లీ ఇప్పుడు తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 155 పాఠశాలల్లో స్మార్ట్‌ కిచెన్‌ ఏర్పాటుకు నివేదికలు పంపాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో తొలి విడతలో 13 పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా జిల్లా అధికారులు కూడా ఆగమేఘాల మీద సౌకర్యవంతంగా ఉన్న పాఠశాలలను గుర్తించి స్మార్ట్‌ కిచెన్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని మండల విద్యాశాఖాధికారులకు(ఎంఈఓ)ఆదేశాలు జారీ చేయగా వారు నివేదికలు పంపిస్తు న్నారు. పది లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు తప్ప విద్యార్థులు ఎక్కువ మంది ఉన్న పాఠశాలలకు స్మార్ట్‌ కిచెన్ల ద్వారా మధ్యాహ్న భోజనం సరఫరా చేయనున్నారు. ఒకచోట భోజనం తయారు చేసి 1 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలల విద్యార్థులకు అందించాలన్నది ప్రభుత్వ ఆలోచన.

వంట కార్మికుల ఆందోళన...

మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న ఏజెన్సీలను తొలగించి స్మార్ట్‌ కిచెన్ల పేరుతో మధ్యాహ్న భోజనం నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయన్న సమాచారంతో ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో వంటలు నిర్వహిస్తున్న మహిళలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులను ఆదుకుంటామంటూ ప్రకటనలు చేసిన చంద్రబాబు తమ పొట్ట గొట్టేందుకే ఈ పథకాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టే ప్రయ త్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఫలితంగా ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్న తమను రోడ్డును పడేస్తే ఎలా? అని ... ఇన్నేళ్లుగా కష్టపడి పనిచేసిన దానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రతిఫలం ఇదేనా ... అంటూ మధ్యాహ్న భోజన నిర్వాహకులు మండిపడుతున్నారు.

ఎక్కడో దూరంలో ఉన్న విద్యార్థులకు ఒకచోట భోజనం వండి వాహనాల్లో తీసుకెళ్లి ఇవ్వడం అన్నది వ్యయప్రయాసలతో కూడుకున్నది. దీనివల్ల విద్యార్థులకు వేడి పదార్థా లు తినే భాగ్యం లేనట్టేనని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటి వరకు పాఠశాల ఆవరణలోనే మధ్యాహ్న భోజనం వండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కాంట్రాక్టర్ల చేతుల్లోకి పోతుంది. ఎవరిని సంతృప్తి పరచడానికి స్మార్ట్‌ కిచెన్లు తీసుకొస్తున్నారని ప్రజాసంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి విద్యార్థు లకు వండి పెడుతున్న కార్మికుల కడుపులు కొట్టి సొంత పార్టీ నాయకుల బొజ్జలు నింపేందుకే స్మార్ట్‌ కిచెన్ల రూపకల్పన జరిగినట్టు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. స్మార్ట్‌ కిచెన్లకు స్వస్తిపలకాలని కోరుతున్నాయి.

విద్యార్థుల కడుపు మాడ్చేసి .. మధ్యాహ్న భోజన కార్మికులను రోడ్డును పడేసి తమ అనుయాయుల జేబులు నింపేందుకు చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఏళ్ల తరబడి పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పొట్ట గొట్టేందుకు స్మార్ట్‌ కిచెన్ల పేరుతో ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది. ప్రభుత్వం సకాలంలో బిల్లులు ఇవ్వకపోయినా అప్పో సప్పో చేసి విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వండి పథకం కార్మికులు కడుపులు నింపుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే పాత వారిని తొలగించి పచ్చ పార్టీ సానుభూతిపరులను నియమించుకోవాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేశారు. అవి ఫలించక ఇక ఇప్పుడు స్మార్ట్‌ కిచెన్ల పేరుతో అసలుకే ఎసరు పెట్టాలని చూస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వేడి అన్నం స్థానంలో తమ పిల్లలు ఎప్పుడో తెల్లవారి వండిన భోజనాన్ని తినాల్సి వస్తుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement