తొమ్మిది మంది బైక్‌ రైడర్లపై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

తొమ్మిది మంది బైక్‌ రైడర్లపై కేసు నమోదు

Mar 25 2026 7:24 AM | Updated on Mar 25 2026 7:24 AM

నరసరావుపేట రూరల్‌: బైక్‌ రైడర్ల హల్‌చల్‌ అంటూ సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనంపై రూరల్‌ పోలీసులు స్పందించారు. బైకులపై విన్యాసాలు చేస్తూ వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్న తొమ్మిది మంది యువకులను మంగళవారం అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. సోషల్‌ మీడియాలో వచ్చిన వీడియోల ఆధారంగా పోలీసులు వీరిని గుర్తించారు. యువకులు పట్టణంలోని పలు ప్రాంతాలకు చెందినవారు. వారి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించిన సీఐ ఎంవీ.సుబ్బారావు, ఎస్‌ఐలు కిషోర్‌, శ్రీకాంత్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. యువకులను బైక్‌ రేసింగ్‌లకు దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు. మితిమీరిన వేగంతో చేసే విన్యాసాల కారణంగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా వస్తుందని తెలి పారు. దీనిపై రూరల్‌ సీఐ సుబ్బారావు మాట్లాడుతూ బైక్‌ రేసింగ్‌లో కీలకంగా వ్యవహరించిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు అతని డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేసే విధంగా రవాణా శాఖ అధికారులకు సిఫార్సు చేసినట్లు వివరించారు.

వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు దరఖాస్తు చేసుకోండి

జిల్లా క్రీడాభివృద్ధి అధికారి నరసింహారెడ్డి

నరసరావుపేటఈస్ట్‌: క్రీడలను ప్రోత్సహించి ఉత్తమ క్రీడాకారులగా తీర్చిదిద్దేందుకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటుచేస్తున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి మంగళవారం తెలిపారు. ఈ మేరకు ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ ఉత్తర్వులు జారీ చేసినట్టు వివరించారు. శిక్షణ శిబిరాలను నిర్వహించేందుకు ఆసక్తి ఉన్న క్రీడా అసోసియేషన్‌లు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా శిక్షకులు, సీనియర్‌ క్రీడాకారులు ఈనెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసు కోవాలని కోరారు. పల్నాడు జిల్లా పరిధిలో 50 క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రతి శిబిరంలో 25 మంది బాలురు, 25 మంది బాలికలకు వివిధ క్రీడాంశాలలో శిక్షణ ఇస్తామన్నారు. శాప్‌ ఆదేశాల మేరకు 2026–27 సంవత్సరానికి మే 1 నుంచి 31వ తేదీ వరకు 8 నుంచి 14 సంవత్సరాల వయస్సు ఉన్న బాలబాలికలు శిబిరంలో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు. శిక్షణ శిబిరం ఏర్పాటుకు బాస్కెట్‌బాల్‌ సీహెచ్‌.శ్రీనివాసరావు 8143475010, రెజ్లింగ్‌ కె.మనోహర్‌ 8309426350, అథ్లెటిక్స్‌ ఎం.సైదారావు 8019219224లకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 8712622574 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు.

జిల్లా స్థాయి శాప్‌ లీగ్‌ అథ్లెటిక్స్‌ టీం ఎంపిక

నరసరావుపేటఈస్ట్‌:సత్తెనపల్లి రోడ్డులోని డీఎస్‌ఏ స్టేడియంలో మంగళవారం జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌, చెస్‌ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించి జిల్లా జట్టు ఎంపిక చేశారు. ఆయా పోటీలలో 60 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి తెలిపారు. పోటీలలో 35 నుంచి 45 సంవత్సరాల వయస్సుగల మహిళలు, పురుషులు (మాస్టర్స్‌) పాల్గొన్నారు. పరుగుపందెం, లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌, డిస్కస్‌త్రో, హైజంప్‌, జావలిన్‌, రిలే పరుగు పందేలు నిర్వహించా రు. పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు ఈనెల 30, 31తేదీలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యా లయంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలలో జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు.

మైనర్‌ బాలికపై లైంగిక దాడి

మైనర్‌ నిందితుడిపై పోక్సో కేసు

నాదెండ్ల: మైనర్‌ బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై నాదెండ్ల పోలీసులు మంగళవారం పోక్సో కేసు నమోదు చేశారు. ట్రైనీ ఐపీఎస్‌, ఇన్‌చార్జి ఎస్సై జె నిరంజన్‌ ధర్మేంద్ర సిన్హా తెలిపిన వివరాల మేరకు పదహారేళ్ల బాలికతో పదిహేడేళ్ల మైనర్‌బాలుడు పరిచయం పెంచుకున్నాడు. ఆ పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

ఘనంగా ఏపీ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ద్వితీయ వార్షికోత్సవం

చిలకలూరిపేటటౌన్‌: పట్టణంలోని దివ్యశాంతి నిలయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పాస్టర్స్‌ ఫెలో షిప్‌ – పల్నాడు జిల్లా 2వ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పాస్టర్స్‌ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పాస్టర్స్‌ ఫెలోషిప్‌– పల్నాడు జిల్లా ఆర్గనైజింగ్‌ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి జిల్లా అధ్యక్షులు బిషప్‌ నందమూరి క్రిస్టర్‌ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. పాస్టర్స్‌, చర్చిలకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. క్రైస్తవ సమాజానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చా రు. క్రైస్తవుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార దిశగా పనిచేస్తామని అన్నారు. అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు బిషప్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సిన్హా, ఏఐసీసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ జుహాని హలోనేన్‌పాల్గొని దేవుని వాక్య సందేశం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement