ఇటీవల పట్టణంలోని 670 శునకాలను పట్టించి ఒంగోలులోని స్నేహ యానిమల్ కేర్ ఏజెన్సీకి పంపించి కు.ని. శస్త్రచికిత్సలు చేయించాం. ఇందుకు రూ.9 లక్షలు వ్యయం కాగా, సదరు ఏజెన్సీకి రూ.8 లక్షలు చెల్లించాం. మరో రూ.లక్ష బకాయి ఉన్నాం. అయితే తాజాగా ప్రత్యేక వ్యక్తులకు వీటిపై శిక్షణ ఇప్పించి ఆపరేషన్లు చేయించాలనే నిర్ణయానికి వచ్చాం. అలాగే వీధి కుక్కల పోషణ జాగ్రత్తలపై పట్టణ ప్రజలకు అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకోబోతున్నాం.
– పి. శ్రీహరిబాబు,
మున్సిపల్ కమిషనర్, చిలకలూరిపేట


