గుంటూరు మెడికల్: ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ 19వ వార్షిక సదస్సు ఈనెల 13 నుంచి 15 వరకు కొచ్చిలోని గ్రాండ్ హయత్ హోటల్లో విజయవంతంగా నిర్వహించినట్లు ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ పమిడిముక్కల విజయ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా, విదేశాల నుంచి ప్రముఖ న్యూరాలజిస్టులు, స్ట్రోక్ నిపుణులు, పరిశోధకులు, ఆరోగ్య రంగ నిపుణులు పాల్గొన్నట్లు వెల్లడించారు. సదస్సులో డాక్టర్ విజయ ప్రెసిడెన్షియల్ ఓరియంటేషన్ ముఖ్య ఆకర్షణగా నిలిచిందని తెలిపారు. 1990లలో థ్రోంబోలైటిక్ చికిత్స అందుబాటులోకి రాకముందు పరిస్థితుల నుంచి ప్రారంభించి, 1995లో 3 గంటల్లో క్లాట్ బస్టింగ్ థెరపీ ఆవిష్కరణ, 2005లో స్ట్రోక్ కేర్ అభివృద్ధి, 2015లో న్యూరో ఇమేజింగ్, మెకానికల్ థ్రోంబెక్టమీ పురోగతి వరకు జరిగిన పరిణామాలను వివరించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎంపిక చేసిన రోగులకు 24 గంటల వరకు చికిత్స అవకాశాలు విస్తరించిన విషయాన్ని డాక్టర్ పి.విజయ ప్రస్తావించారు. అత్యంత ప్రేరణాత్మకంగా నిలిచి, 400 మందికి పైగా జాతీయ అంతర్జాతీయ ప్రతినిధుల స్టాండింగ్ అవేషన్ అందుకున్నట్లు తెలిపారు.
ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అధ్యక్షురాలు
డాక్టర్ పమిడిముక్కల విజయ


