మోసం తెలియని నేత వైఎస్ జగన్ ● పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైనా ఒక్క పింఛన్ కూడా ఇవ్వడం చేతకాలేదన్నారు. యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు. అసెంబ్లీలో ఆరు లక్షలు ఉద్యోగాలు ఇచ్చానని చెబుతున్నారు. ఎవరికి ఇచ్చారో చెప్పాలన్నారు. కొడుకుకి, పవన్ కళ్యాణ్‌కి ఉద్యోగం ఇచ్చుకోవటం మినహా మరి ఎవరికై నా ఉద్యోగం ఇచ్చారా అన్నారు. సూపర్ సిక్స్ ఇచ్చాం.. అయిపోయిందన్నారు. జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రంలో 10వేల సచివాలయాలు నిర్మిస్తే, చంద్రబాబు నాయుడు 20 వేల బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారన్నారు. నారా ఇంటి పేరును మార్చి సారా చంద్రబాబునాయుడుగా పేరు పెట్టాలన్నారు. ఊరికి ఐదు వరకు బెల్ట్ షాపులు పెట్టి నాయకులు సంపాదించుకుంటున్నారన్నారు.
● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మాట్లాడుతూ చేతులు తీసే పార్టీ టీడీపీ అయితే కడుపునిండా పెట్టే పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నారు.
● తొలుత గ్రామానికి వెళ్లిన నాయకుల బృందానికి గ్రామస్తులు ఎదురేగి స్వాగతం పలికారు. శంకరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరునాళ్లలో నాయకులు కోలాటం ఆడారు. గ్రామంలోని చెరువుగట్టు సెంటర్‌లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
● వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ ప్రభ కమిటీని అభినందించారు.
రొంపిచర్ల: మోసం చేయడం తెలియని నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని యర్రగొండపాలెం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. ఉగాది సందర్భంగా రొంపిచర్లలో గురువారం రాత్రి శ్రీ బాల త్రిపుర సమేత శంకరేశ్వరస్వామి తిరునాళ్లలో పాల్గొని ఆయన మాట్లాడారు. రెండు సంవత్సరాల టీడీపీ పాలనలో ప్రజలకు ఏమి చేయకుండా నయవంచన చేశారన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పడాల శివారెడ్డి, పడాల చక్రారెడ్డి, గెల్లి బ్రహ్మారెడ్డి, గెల్లి కోటిరెడ్డి, జిల్లా రైతు విభాగ అధ్యక్షుడు అన్నెం పున్నారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కురుగుంట శ్రీనివాసరెడ్డి, పునుగోటి వెంకట్రావు, మోతుకూరి వెంకటేష్, నరసరావుపేట మండల పార్టీ అధ్యక్షుడు మోరబోయిన శ్రీనివాసరావు, పచ్చవ రవీంద్రబాబు, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.
యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్