ఇంజినీరింగ్‌ కోర్సుల దరఖాస్తు గడువు పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్‌ కోర్సుల దరఖాస్తు గడువు పొడిగింపు

Mar 21 2026 5:20 AM | Updated on Mar 21 2026 5:20 AM

మే 12,13,14,15,18వ తేదీల్లో ఇంజినీరింగ్‌, మే 19, 20వ తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో జరగనున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న 40 ఇంజినీరింగ్‌ కళాశాలల పరిధిలో ఇంజినీరింగ్‌లో చేరేందుకు 20వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా రూ.వెయ్యి అపరాధ రుసుంతో కలిపి చెల్లించేందుకు ఈనెల 28, రూ.రెండు వేల అపరాధ రుసుంతో ఏప్రిల్‌ ఒకటి, రూ.4000లతో కలిపి చెల్లించేందుకు ఏప్రిల్‌ 6వ తేదీ, రూ.10వేలతో కలిపి చెల్లించేందుకు ఏప్రిల్‌ 10 వరకు అవకాశం ఉంది.

గుంటూరు, నరసరావుపేట, బాపట్ల జిల్లా ల్లోని 36 ఇంజనీరింగ్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటాలో 30,240 సీట్లు ఉన్నాయి. వీటిలో రెండు ప్రభుత్వ కళాశాలల్లో 780 సీట్లు ఉండగా, 34 ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 29,460 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

సీనియర్‌ ఇంటర్‌ పరీక్షలు రాసిన ఎంపీసీ, బైపీసీ గ్రూపుల విద్యార్థులు cetr.aprche.ap.gov.i n

ఏపీఈఏపీసెట్‌–2026 సైట్‌కు లాగిన్‌ అయిన తరువాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు స్టెప్‌–1 మొదలు స్టెప్‌–5 వరకు ఐదు దశల్లో కనిపించే ట్యాబ్‌లను వరుస క్రమంలో క్లిక్‌ చేస్తూ, పొందుపర్చిన వివరాలు పూర్తి చేయాల్సి ఉంటుంది.

స్టెప్‌–1 ‘ఎలిజిబుల్టీ క్రైటీరియా అండ్‌ ఫీజు పేమెంట్‌’కు లాగిన్‌ అయ్యి సీనియర్‌ ఇంటర్‌ హాల్‌ టిక్కెట్‌ ఎంటర్‌ చేయాలి. అనంతరం విద్యార్థి పుట్టిన తేదీ, మొబైల్‌ నంబరు, ఆల్టర్నేటివ్‌ మొబైల్‌ నంబరు, ఈ–మెయిల్‌ ఐడీ నమోదు చేయాలి. దీంతో పాటు ఇంజినీరింగ్‌–ఫార్మసీ, అగ్రికల్చర్‌–ఫార్మసీ, బోత్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీల వారీగా తాము రాయబోవు ప్రవేశ పరీక్ష, చేరనున్న కోర్సుల వారీగా మూడు ఆప్షన్లలో ఒక దానిని ఎంపిక చేసుకుని, క్లిక్‌ చేయాలి.

తరువాత సామాజిక వర్గాల వారీగా కేటగిరీపై క్లిక్‌ చేసి, ఆన్‌లైన్‌లో ఫీజు పేమెంట్‌ చేయాలి. క్రెడిట్‌, డెబిట్‌కార్డు, నెట్‌ బ్యాంకింగ్‌ మార్గాల్లో ఫీజు చెల్లించాల్సి ఉంది.

స్టెప్‌–2 నో యువర్‌ పేమెంట్‌ స్టేట్‌స్‌పై క్లిక్‌ చేసి, సీనియర్‌ ఇంటర్‌ హాల్‌ టిక్కెట్‌ నంబరు, మొబైల్‌ నంబరు, పుట్టిన తేదీ వివరాలు పూర్తి చేయాలి. తదుపరి చేరనున్న కోర్సుల వారీగా ఇంజినీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌లలో ఏదైనా ఒక దానిని ఎంపిక చేసుకుని క్లిక్‌ చేయడంతో స్టెప్‌–2 దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.

స్టెప్‌–3లో ఫిల్‌ అప్లికేషన్‌లో పేమెంట్‌ చేసిన ఐడీతో పాటు సీనియర్‌ ఇంటర్‌ హాల్‌ టిక్కెట్‌ నంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదు చేయాలి. అనంతరం ప్రొసీడ్‌ టు ఫిల్‌ అప్లికేషన్‌పై క్లిక్‌ చేసి స్టెప్‌–4కు వెళ్లాలి. అక్కడ నో యువర్‌ అప్లికేషన్‌ స్టేటస్‌పై క్లిక్‌ చేసి, పూర్తి చేసిన దరఖాస్తు ఫారాన్ని సందర్శించవచ్చు. స్టెప్‌–5పై క్లిక్‌ చేసి ఆన్‌లైన్‌లో సబ్మిట్‌ చేసిన దరఖాస్తు ఫారాన్ని ప్రింట్‌ తీసుకుని భద్రపరచుకోవాలి.

ఫీజు చెల్లించే సమయంలో ఇచ్చిన రిఫరెన్స్‌ ఐడీ, విద్యార్థి పేరు, సీనియర్‌ ఇంటర్‌ హాల్‌ టిక్కెట్‌, పుట్టినతేదీ వివరాలతో భవిష్యత్తులో ఈఏపీ సెట్‌ హాల్‌ టిక్కెట్‌, పరీక్షకు హాజరయ్యే సమయంలో సంబంధిత వివరాలు కీలకంగా మారుతాయి.

ఈనెల 24 వరకు ఏపీ ఈఏపీ సెట్‌–2026 దరఖాస్తుల స్వీకరణ

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఇంటర్మీడియెట్‌ విద్యార్హతతో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్‌–2026 ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ గడువు ఈనెల 24వ తేదీవరకు పొడిగించారు. ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన ఏపీ ఈఏపీసెట్‌–2026 (గతంలో ఎంసెట్‌) నోటిఫికేషన్‌ ఆధారంగా సీనియర్‌ ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులతో తాజాగా పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఏపీ ఈఏపీ సెట్‌–2026 ఆధారిత ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికై దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

ఉమ్మడి జిల్లాలో 36 ఇంజనీరింగ్‌

కళాశాలల్లో 30,240 సీట్లు

ఏపీ ఈఏపీసెట్‌ సైట్‌లో పూర్తి సమాచారం

సైట్‌కు లాగిన్‌ అయ్యి ఏపీ ఈఏపీసెట్‌–2026పై క్లిక్‌ చేయాలి. ఏపీఈఏపీసెట్‌ సైట్‌లో పరీక్ష రాసేందుకు అర్హతలు, దరఖాస్తు పూరింపు ప్రక్రియతో పాటు కోర్సుల వివరాలు, ఏపీఈఏపీ సెట్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, ఇన్‌స్టక్షన్స్‌ మాన్యువల్‌ తదితర పూర్తి వివరాలను పొందవచ్చు.

ఏపీ ఈఏపీ సెట్‌కు దరఖాస్తు ఇలా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement