టీవీ–5లో మిడ్‌నైట్ మసాలా వేసిన వ్యక్తి టీటీడీ చైర్మన్‌గా పనికిరాడు తిరుపతిలో శాంతియుతంగా నిరసన చేస్తున్న మహిళలపై దాడులు దారుణం ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలు, టీటీడీ ప్రతిష్టను కాపాడాలి డ్రగ్స్ తీసుకున్న ఏలూరు ఎంపీ పుట్టాపై వెంటనే చర్యలు తీసుకోవాలి మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి, కాసు మహేష్ రెడ్డి డిమాండ్
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా
నరసరావుపేట: తిరుమల–తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా బీఆర్ నాయుడుని తక్షణమే తొలగించి టీటీడీ పవిత్రత, ప్రపంచ వ్యాప్తంగా భక్తుల మనోభావాలు కాపాడాలని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల మాజీ శాసన సభ్యులు కాసు మహేష్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుపతిలో ధర్నా చేస్తున్న వైఎస్సార్‌సీపీ మహిళలపై టీడీపీ వ్యక్తులు దాడి చేసినందుకు నిరసనగా మంగళవారం పట్టణంలోని డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎర్రటి ఎండలో రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బీఆర్ నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తొలుత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
గురజాల పరిశీలకులు, రాష్ట్ర కార్యదర్శి పడాల శివారెడ్డి, ఎస్‌సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కందుల ఎజ్రా, విద్యార్థి, రైతు విభాగాల జిల్లా అధ్యక్షులు జి.ఆకాష్‌కుమార్, అన్నెం పున్నారెడ్డి, నకరికల్లు మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి, అంగన్‌వాడీ విభాగ రాష్ట్ర కార్యదర్శి హెల్డా ప్లోరేన్స్, ఎస్‌సీ సెల్ జిల్లా అధ్యక్షులు కొమ్ము చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి నెలటూరి సురేష్, జిల్లా కార్యదర్శి ఎస్.సుజాతా పాల్, పట్టణ అధ్యక్షులు షేక్ కరిముల్లా, మాజీ ఎంపీపీ టి.మంగమ్మ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కనకా పుల్లారెడ్డి, పట్టణ ఎస్‌సీ సెల్ అధ్యక్షులు కుక్కల పౌలయ్య, మాజీ సర్పంచ్ కోడూరి వెంకటేశ్వరరెడ్డి, మైనార్టీ విభాగ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు షేక్ శిలార్, సయ్యద్ ఖాదర్ బాషా, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి సుబ్రహ్మణ్యం, సోషల్ మీడియా నియోజకవర్గ అధ్యక్షులు బూదాల కల్యాణ్ తదితర నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.


