రెండు కాళ్లకు దెబ్బతగిలినా... పరీక్షకు | - | Sakshi
Sakshi News home page

రెండు కాళ్లకు దెబ్బతగిలినా... పరీక్షకు

Mar 17 2026 7:32 AM | Updated on Mar 17 2026 7:32 AM

రెండు కాళ్లకు దెబ్బతగిలినా... పరీక్షకు

పిడుగురాళ్ల : రెండు కాళ్లకు దెబ్బలు తగిలినా పరీక్షలు రాయాలనే దృఢ సంకల్పంతో ఓ విద్యార్థి పరీక్ష హాల్‌కు వచ్చి పరీక్ష రాశాడు. పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామానికి చెందిన సయ్యద్‌ ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. 20 రోజుల కిందట ఉదయం పూట ట్యూషన్‌కు వెళ్తుండగా, రోడ్డు ప్రమాదం జరిగి రెండు కాళ్లకు గాయాలయ్యాయి. మంగళగిరిలో చికిత్స నిర్వహించారు. పరీక్షలు రాయాలనే సంకల్పంతో సోమవారం పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్‌లో 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. తల్లిదండ్రులు, బంధువులు జానపాడు నుంచి ఆటోలో జాబిర్‌ను తీసుకొని వచ్చారు. పరీక్ష కేంద్రం శ్రీ చైతన్య స్కూలులో మూడో ఫ్లోర్‌లో ఉండటంతో తల్లిదండ్రులు ఆటోలోని సీట్‌ సహాయంతో జాబిర్‌ను ఎత్తుకొని తీసుకొని వెళ్లటం, తీసుకొని రావటం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement