గోల్‌షాట్‌ బాల్‌ ఎగ్జిక్యూటివ్‌ సమావేశం విజయవంతం | - | Sakshi
Sakshi News home page

గోల్‌షాట్‌ బాల్‌ ఎగ్జిక్యూటివ్‌ సమావేశం విజయవంతం

Mar 17 2026 7:32 AM | Updated on Mar 17 2026 7:32 AM

కొల్లూరు, (వేమూరు) : గోల్‌ షాట్‌ బాల్‌ దేశవ్యాప్త ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశాలు మండలంలోని చిలుమూరు శ్రీరామ సైనిక్‌ స్కూల్లో విజయవంతంగా జరిగాయి. ఈనెల 14, 15 తేదీల్లో రెండు రోజులు పాటు నిర్వహించిన సమావేశాల్లో దేశంలోని 13 రాష్ట్రాల నుంచి వచ్చిన కార్యదర్శులు పాల్గొన్నారు. గోల్డ్‌ షాప్‌ బాల్‌ క్రీడాభివృద్ధికి, భవిష్యత్తులో నిర్వహించాల్సిన కార్యాచరణ, క్రీడ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కోచ్‌లు, పీఈటీలు, పీడీలకు గోల్‌ షాట్‌ బాల్‌ ఆటపై అవగాహన సదస్సు, ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో శిక్షణలో పాల్గొన్న వ్యాయామ ఉపాధ్యాయులకు పరీక్ష నిర్వహించి, అర్హత సాధించిన వారికి రాష్ట్ర స్థాయి రిఫరీలుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్‌ గేమ్‌ ఫౌండర్‌, ప్రధాన కార్యదర్శి నోట్ల రాజేంద్ర ప్రసాద్‌ హాజరయ్యారు. శ్రీ రామా సైనిక్‌ స్కూల్‌ అధ్యక్షులు కె.తులసి విష్ణు ప్రసాద్‌, గోల్డ్‌ షాట్‌ బాల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు బిహార్‌ రాష్ట్రానికి చెందిన రామ్‌ పరమేష్‌ కుమార్‌ (అసోసియేషన్‌ ట్రెజరర్‌), తమిళనాడుకు చెందిన ఆర్‌. కరుణాకర్‌ (సౌత్‌ ఇండియా ఇన్‌చార్జ్‌), మహారాష్ట్రకు చెందిన యోగేష్‌ పటేల్‌ (వెస్ట్‌ ఇన్‌చార్జ్‌), ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రభాకర్‌ (ఈస్ట్‌ ఇంచార్జ్‌), ఢిల్లీకి చెందిన నితిన్‌ షైన్‌ (నార్త్‌ ఇన్‌చార్జ్‌), వెస్ట్‌ బెంగాల్‌ నుంచి రాజ్‌ ఠాకూర్‌, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి దేవి ప్రియ ప్రారంభించిన కార్యక్రమంలో ఆర్గనైజర్‌ సెక్రటరీ వణుకూరి గోపికృష్ణ, వర్కింగ్‌ సెక్రటరీ ప్రసన్న కుమార్‌ పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement