వస్తువుల కొనుగోలులో మోసపోరాదు | - | Sakshi
Sakshi News home page

వస్తువుల కొనుగోలులో మోసపోరాదు

Mar 17 2026 7:32 AM | Updated on Mar 17 2026 7:32 AM

వస్తువుల కొనుగోలులో మోసపోరాదు

బాపట్ల: ప్రజలు ఏ వస్తువులు కొనుగోలు చేసే సమయంలో మోసానికి గురికాకుండా అవగాహన పొందాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ భావన వశిష్ట తెలిపారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. నాణ్యమైన ఆహార పదార్థాలు, నాణ్యత ప్రమాణాలతో రూపొందించిన తూనికలు, కొలతలు యంత్రాల ప్రదర్శించారు. వినియోగదారులకు అవగాహన కల్పిస్తూ రూపొందించిన గోడపత్రాలను జేసీ విడుదల చేశారు. ఆహార పదార్థాలను కొనుగోలు చేసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి జమీర్‌ బాషా, పౌర సరఫరాల కార్పొరేషన్‌ జీఎం శ్రీలక్ష్మి, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రణీత్‌, తూనికలు కొలతలశాఖ సహాయ కమిషనర్‌ లిల్లీ, డీటీఓ పరందామరెడ్డి, వాణిజ్య శాఖ అధికారి గౌరీ, డీసీఐసీడీ ఇమ్మానియేలు పాల్గొన్నారు.

బాపట్ల జిల్లా జేసీ భావన వశిష్ట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement