పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Mar 17 2026 7:31 AM | Updated on Mar 17 2026 7:31 AM

మంగళవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2026 రసవత్తరంగా మారిన బార్‌ అసోసియేషన్‌ ఎన్నిక పులిచింతల సమాచారం ఇఫ్తార్‌ సహరి (మంగళ) (బుధ) నరసరావుపేట 6.26 5.00 గుంటూరు 6.24 4.58 బాపట్ల 6.24 4.58

బెడిసి కొట్టిన టీడీపీ లీగల్‌ సెల్‌ వ్యూహం ఒకే సామాజిక వర్గం నుంచి ఇరువురు పోటీ పది పదవులకు 17 నామినేషన్లు దాఖలు మూడు పదవులకు ఒక్కొక్కరే నామినేషన్‌

న్యూస్‌రీల్‌

బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష పదవి ఏకగ్రీవంగా కావాలని విశ్వప్రయత్నం చేశారు.

సోమవారం నామినేషన్‌ల ప్రక్రియ ప్రారంభం కావడంతో టీడీపీ లీగల్‌ సెల్‌ వ్యూహం బెడిసి కొట్టింది. ఆ పార్టీ నుంచి ఒక్కరే పోటీ చేయాలని నిర్ణయించినప్పటికీ ఇరువురు న్యాయవాదులు నామినేషన్లు దాఖలు చేశారు.

బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష పదవికి న్యాయవాదులు పూదోట రాజు, గంగూరి అజయ్‌కుమార్‌, చిన్నం మణిబాబులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే గంగూరి అజయ్‌కుమార్‌ నామినేషన్‌ దాఖలు చేయడని, పూదోట రాజు మాత్రమే బరిలో ఉంటాడని న్యాయవాదులు భావించారు. కానీ అజయ్‌కుమార్‌ నామినేషన్‌ దాఖలు చేయడంతో ఎన్నిక రసవత్తరంగా మారింది.

బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్ష పదవికి సందెపోగు బాబూరావు, గుజ్జర్లపూడి సురేష్‌బాబు, ప్రధాన కార్యదర్శి పదవికి గంటా కోటి శివ, షేక్‌ జాని ఖాజావలి, సబ్‌ కోర్టు కార్యదర్శిగా పినపాటి భవానీ, సంయుక్త కార్యదర్శిగా టి.పూర్ణచంద్రరావు, కాశిమాల మార్క్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా ఎం.రామాంజనేయులు, తాళ్లూరి వినయ్‌భరత్‌, ట్రెజరర్‌గా బుర్రి సైదయ్య, లైబ్రేరియన్‌గా ఆకుల నాగార్జున, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా గుర్రం పవన్‌కుమార్‌, ఎం.సాయిశ్రీకర్‌, స్పోర్ట్స్‌ కల్చరల్‌ సభ్యుడిగా పుత్తూరి హరిమణికంఠ నామినేషన్లు దాఖలు చేశారు.

మొత్తం పది పదవులకు 17 మంది పోటీ పడుతున్నారు. వీరిలో ట్రెజరర్‌గా బుర్రి సైదయ్య, లైబ్రేరియన్‌గా ఆకుల నాగార్జున, స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ సభ్యుడిగా పొత్తూరి హరిమణికంఠ ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్‌ దాఖలు చేశారు.

జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా ఇరువురు పోటీ పడగా, వారిలో ఒకరు మహిళా అభ్యర్థి ఉండాలి. దీనిపై బార్‌ అసోసియేషన్‌ అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.

మంగళవారం నామినేషన్‌ల పరిశీలన, 18న నామినేషన్‌ల ఉపసంహరణ ప్రక్రియ జరుగుతోందని ఎన్నికల ప్రధాన అధికారి, సీనియర్‌ న్యాయవాది గుజ్జర్లపూడి మార్క్‌రావు తెలిపారు.

19న పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనుండగా, 27న ఎన్నికలు నిర్వహించనున్నారు.

మంగళవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2026
రసవత్తరంగా మారిన బార్‌ అసోసియేషన్‌ ఎన్నిక

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.6755 టీఎంసీలు.

సత్తెనపల్లి: మునుపెన్నడూ లేని విధంగా సత్తెనపల్లి బార్‌ అసోసియేషన్‌ ఎన్నిక రసవత్తరంగా మారింది. రాజకీయాలకతీతంగా న్యాయవాదులు ఎన్నుకోవాల్సిన బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష పదవిని కై వసం చేసుకునేందుకు టీడీపీ లీగల్‌ సెల్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేసి ముందస్తు సమావేశం నిర్వహించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement