ఇండో–ఇజ్రాయెల్ ప్రాజెక్టును పరిశీలించిన ఇజ్రాయెల్ ప్ర
నకరికల్లు: నకరికల్లు మండలం నర్శింగపాడు సమీపంలోని బాలాజీనగర్‌తండా వద్ద నిర్మాణదశలో ఉన్న ఇండో–ఇజ్రాయెల్ అగ్రికల్చర్ ప్రాజెక్టు పనులను ఇజ్రాయెల్ దేశపు పొలిటికల్ అఫైర్స్ సెక్రెటరీ సారా వోల్గా మెలిండా ఎనౌస్కి సోమవారం పరిశీలించారు. అగ్రికల్చర్ ట్రైనింగ్ సెంటర్, ఫార్మర్స్ హాస్టల్ తదితర పనుల పురోగతి, నిధుల వినియోగం, ప్రాజెక్టు ఎప్పటికి అందుబాటులోకి వస్తుందన్న అంశాలపై హార్టికల్చర్ అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర హార్టికల్చర్ జాయింట్ డైరెక్టర్ మునిరెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టు పనులు వేగవంతంగా సాగుతున్నాయని వివరించారు. ఆమె వెంట జిల్లా హార్టికల్చర్ అధికారి వి.వెంకట్రావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
తెనాలి: శ్రీవాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని మంగళవారం తెనాలిలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఘనంగా నిర్వహించనున్నారు. సంబంధిత ఆహ్వానపత్రికను వాసవి యూత్, తెనాలి నాయకులు సోమవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ‘శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడంపై వాసవీ యూత్, తెనాలి నాయకులు హర్షం వ్యక్తంచేశారు. తెనాలి బోసురోడ్డులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరిగే అమ్మవారి ఆత్మార్పణ దినోత్స వానికి అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. వాసవీ యూత్ నాయకులు నాళం రజనీకుమార్, కొప్పురావూరి కిషోర్, కనమర్లపూడి శ్రీనివాస్, మాజేటి బదరికిరణ్, చీమకుర్తి సతీష్, దేసు రవి, వలివేటి సురేష్, పొన్నూరు తుక్కయ్య, పాల్గొన్నారు.
తెనాలి: ప్రముఖ హైకోర్టు న్యాయవాది నారపరెడ్డి రాజారెడ్డి ఆధ్వర్యంలో ‘లాయర్స్ వాయిస్’ మాస పత్రిక విజయవాడ కేంద్రంగా గత పదేళ్లుగా నడుస్తోంది. ఆ పత్రిక ఆధ్వర్యంలో 2026 సంవత్సర కేలండర్‌ను సోమవారం స్థానిక గంగానమ్మపేటలోని నవోదయ విద్యానికేతన్‌లో ఆవిష్కరించారు. నవోదయ విద్యానికేతన్ కరెస్పాండంట్ రాంబాబు, వివేకానంద అసోసియేట్స్ (జాబ్ కాన్సల్టెన్సీ) చైర్మన్ నాగిశెట్టి సాయిచరణ్, లాయర్స్ వాయిస్ ఎడిటర్ ఎన్.రాజారెడ్డి పాల్గొన్నారు. రాంబాబు, సాయిచరణ్ మాట్లాడుతూ రాజారెడ్డి ఆధ్వర్యంలో పదేళ్లుగా పత్రికను నడపడం సంతోషంగా ఉందన్నారు.
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు రావాలంటూ కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన ఎ.స్వాతికి ఆహ్వానం అందింది. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తూ 2016 నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తూ వివిధ రకాల దేశీయ వరి రకాలు భర్తతో కలిసి 20 ఎకరాలు సాగు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానాలు పూర్తిగా పాటిస్తూ ఎటువంటి ఎరువులు, పురుగుమందులు వాడకుండా రసాయన రహిత వ్యవసాయం చేస్తున్నారు. స్వాతి సోమవారం జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాను పీజీఆర్‌ఎస్ హాలులో కలిసింది. కలెక్టర్ ఆమెను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి, జిల్లా ప్రాజెక్టు అధికారి రాజకుమారి స్వాతిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఇండో–ఇజ్రాయెల్ ప్రాజెక్టును పరిశీలించిన ఇజ్రాయెల్ ప్ర
ఇండో–ఇజ్రాయెల్ ప్రాజెక్టును పరిశీలించిన ఇజ్రాయెల్ ప్ర
ఇండో–ఇజ్రాయెల్ ప్రాజెక్టును పరిశీలించిన ఇజ్రాయెల్ ప్ర


