కోల్డ్ స్టోరేజీ యాజమాన్యాల సమస్యలు పరిష్కరించాలి
● కోల్డ్ స్టోరేజ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సురేంద్రబాబు మాట్లాడుతూ కోట్ల రూపాయల బ్యాంకు రుణాలతో నిర్మించుకున్న కోల్డ్ స్టోరేజీల యాజమాన్యాలు గత పది సంవత్సరాలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణం తమని ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యంగా మారే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
● కోల్డ్ స్టోరేజ్‌లను వ్యవసాయ పరిశ్రమగా గుర్తించగలిగితే కొంత ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. కోళ్లు, రొయ్యల పరిశ్రమలను వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా గుర్తించినట్లు తమను కూడా గుర్తించినట్లయితే కరెంటు టారిఫ్‌లు తగ్గి కొంత ఉపశమనం కలుగుతుందని వేడుకున్నారు.
● స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కొరిటెపాడు(గుంటూరు వెస్ట్): గుంటూరు జిల్లాలో శీతల గిడ్డంగుల యాజమాన్యాల సమస్యలను పరిష్కరించాలని కోల్డ్ స్టోరేజ్‌ల ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.సురేంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ది గుంటూరు జిల్లా కోల్డ్ స్టోరేజ్‌ల ఓనర్స్ వేల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం చుట్టుగుంటలోని మార్కెటింగ్‌శాఖ రాష్ట్ర కార్యాలయం ఆవరణలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు సమస్యలతో కూడిన వినతిప్రతం అందజేశారు.
వినతి పత్రం అందజేసిన వారిలో అసోసియేషన్ కార్యదర్శి కేఎస్ రాఘవయ్య, కోశాధికారి ఆర్.రమణ, సభ్యుడు జుగిరాజ్ భండారి తదితరులు ఉన్నారు.
జిల్లా కోల్డ్‌స్టోరేజీల ఓనర్స్ వెల్ఫేర్
అసోసియేషన్ అధ్యక్షుడు సురేంద్రబాబు