అమరావతి–బెల్లంకొండ రోడ్డు విస్తరణ పనులు పునఃప్రారంభం
క్రోసూరు: ఎట్టకేలకు అమరావతి–బెల్లంకొండ రోడ్డు విస్తరణ పనులు పునఃప్రారంభమయ్యాయి. 2023 జూన్ నెలలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం విదితమే. 2024లో రూ.149 కోట్ల నిధులతో అమరావతి నుండి బెల్లంకొండ వరకు సుమారు 40 కిలోమీటర్ల మేర డబుల్ లైన్ రోడ్డు నిర్మాణానికి పనులు చేపట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి పాలనలో పనులు నిలిచిపోయాయి. ఇటీవల కాలంలో కాంట్రాక్టర్‌కు బిల్లులు మంజూరు చేయటంతో పనులు పునఃప్రారంభించినట్లు ఆర్‌అండ్‌బీ ఏఈ పున్నారావు శనివారం తెలిపారు. తొలుత రోడ్డు ట్రాఫిక్‌కు, ప్రజల రాకపోకలకు అంతరాయం కలుగకుండా లెవలింగ్ పనులు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు పనులు శరవేగంగా జరుగుతాయని ఏఈ వివరించారు.
ఏడాదిన్నరగా నిలిచిపోయిన రోడ్డు పనులు


