దీపావళి వేళ... అలుముకున్న విషాదం | - | Sakshi
Sakshi News home page

దీపావళి వేళ... అలుముకున్న విషాదం

Oct 22 2025 7:10 AM | Updated on Oct 22 2025 7:10 AM

దీపావ

దీపావళి వేళ... అలుముకున్న విషాదం

పీసపాడు(క్రోసూరు): ఇళ్లల్లో వెలుగులు నింపే దీపావళి పండుగ ఆ ఇంట్లో అగ్నిప్రమాదం సంఘటన జరిగి విషాదాన్ని నింపింది. సోమవారం ఉదయం పదిగంటలకు మండలంబలోని పీసపాడు గ్రామంలోని కంచేటి సాంబశివరావు ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి అగ్నిప్రమాదం చోటు చేసుకోవటంతో నలుగు రు మంటల్లో చిక్కుకుని గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఇంట్లో వంట గ్యాస్‌ సిలిండర్‌ అయిపోవటంతో కొత్త సిలిండర్‌ మార్చటం జరిగింది. అయితే దానిలో సమస్య ఉండటంతో గ్యాస్‌ లీక్‌ అవుతూ ఉంది. దీన్ని గమనించి ఎదురుగా ఉంటున్న చిన్ని కోటేశ్వరరావును పిలిపించారు. అక్కడికొచ్చిన కోటేశ్వరరావు సిలిండర్‌ లీకేజి పరిశీలిస్తున్న క్రమంలో వంటగదిలో స్విచ్‌ వేయటంతో అకస్మాత్తుగా మంటలంటుకున్నాయి. సిలెండర్‌ పేలిపోవటంతో ఇళ్లు పాక్షిక్లంగా ధ్వంసమైంది. కంచేటి సాంబశివరావు, కంచేటి త్రివేణి, కంచేటి యతేంద్ర, (మనవడు) చిన్న కోటేశ్వరరావుకు శరీరాలకు మంటలంటుకుని తీవ్రగాయాలపాలయ్యారు. చుట్టుప్రక్కల వారి సహాయంతో వీరిని సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించ గా వారిలో కోటేశ్వరరావు, యేతేంద్రలు గుంటూరులోని ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కోటేశ్వరరావు పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు ఎస్‌ఐ రవిబాబు తెలిపారు. సీఐ సురేష్‌, ఎస్‌ఐ, పోలీసు సిబ్బంది, సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం వివరాలు నమోదు చేసుకున్నారు.

టిప్పర్‌ ఢీకొని యువకుడి మృతి

తాడికొండ: టిప్పర్‌ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన తుళ్లూరు మండలం టిడ్కో గృహాల వద్ద జరిగింది. వివరాల ప్రకారం... తుళ్లూరు మండలం దొండపాడు గ్రామం నుంచి తోరటి గోపీ(35) ద్విచక్ర వాహనంపై సీడ్‌ యాక్సిస్‌ రోడ్డుపై వస్తుండగా టిడ్కో గృహాల సమీపంలో ఈ3– ఎన్‌ 16 జంక్షన్‌ వద్దకు రాగానే టిప్పర్‌ వచ్చి ఢీకొంది. అతని తలకు బలమైన గాయమై చనిపోయాడు. సంఘటనా స్థలానికి తుళ్లూరు ట్రాఫిక్‌ పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. జంక్షన్‌ వద్ద రోడ్డుపైకి వచ్చే క్రమంలో నిర్మించిన షెడ్డు కనిపించకపోవడంతో ప్రమాదం జరిగింది. అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం లేదా స్పీడ్‌ బ్రేకర్లు వంటివి ఏర్పాటు చేసి చర్యలు తీసుకోపోవడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

పీసపాడులో గ్యాస్‌ సిలిండర్‌ పేలి అగ్నిప్రమాదం

మంటల్లో చిక్కుకుని

నలుగురికి తీవ్రగాయాలు

దీపావళి వేళ... అలుముకున్న విషాదం   1
1/4

దీపావళి వేళ... అలుముకున్న విషాదం

దీపావళి వేళ... అలుముకున్న విషాదం   2
2/4

దీపావళి వేళ... అలుముకున్న విషాదం

దీపావళి వేళ... అలుముకున్న విషాదం   3
3/4

దీపావళి వేళ... అలుముకున్న విషాదం

దీపావళి వేళ... అలుముకున్న విషాదం   4
4/4

దీపావళి వేళ... అలుముకున్న విషాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement