
సీపీఆర్‌పై అవగాహన అవసరం
గుంటూరు ఎడ్యుకేషన్: అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే సీపీఆర్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ జేవీ సుధీర్ కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ సీపీఆర్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పట్టాభిపురంలోని టీజేపీఎస్ కళాశాల, బ్రాడీపేటలోని బండ్లమూడి హనుమాయమ్మ డిగ్రీ మహిళా కళాశాలలో అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ జేవీ సుధీర్‌కుమార్ మాట్లాడుతూ సీపీఆర్ ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని గుర్తుచేశారు. దేశంలో ఒక్క శాతం మందికి సైతం ఇది తెలియకపోవటం దురదృష్టకరమన్నారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కౌసల్యాదేవి, టీజేపీఎస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బీవీహెచ్ కామేశ్వరశాస్త్రి, రెడ్‌క్రాస్ బ్లడ్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వంశీ కృష్ణారెడ్డి, అధ్యాపకులు పద్మజ, రెడ్ క్రాస్ సిబ్బంది పెరుమాళ్లు గౌరీశిరీష పాల్గొన్నారు.