
బోధనేతర పనులను విరమించుకోవాలి
ఉపాధ్యాయులపై భారం మోపేలా ఉన్న బోధనేతర పనులను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలి. గిన్నిస్‌బుక్ రికార్డుల కోసం ఇప్పటికే యోగాంధ్ర, మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ పేరుతో కార్యక్రమాలకు ముందు, తరువాత ఫొటోల అప్‌లోడ్ చేయించింది. దీనివల్ల బోధన పనిగంటలు వృథా అయ్యాయి. పరీక్షల్లో అసెస్‌మెంట్ బుక్‌లెట్ విధానంతో ఉపాధ్యాయులకు పనిభారం పెరుగుతోంది. అందుకే బోధనేతర పనులను, ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్‌లను బహిష్కరిస్తున్నాం.
–ఎస్‌ఎం సుభాని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు, సత్తెనపల్లి