
పట్టపగలు చోరీ
సంతమాగులూరు(అద్దంకి రూరల్): తాళం వేసిన ఇంటిలోకి దొంగలు ప్రవేశించి బంగారం వెండి, నగదు దొంగిలించిన ఘటన ఆదివారం మండలంలోని కుందుర్రులో జరిగింది. ఎస్‌ఐ ఎం.పట్టాభి అందించిన వివరాలు... మండలంలోని కందుర్రులో ఎస్‌కే ఖాశింసైదా కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళాలు వేసి పనిమీద బయటకు వెళ్లారు. ఈ సమయంలో గుర్తుతెలియని వారు ఇంటి తాళాలు పగులగొట్టి ఇంటికి బీరువా తెరిచి రూ.20 వేల నగదు, సవర బంగారం, 35 తులాల వెండి వస్తువులు అపహరించారు. ఇంటికి వచ్చిన ఖాశింసైదా దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.