
పాఠాలు చెప్పుకునే అవకాశం ఇవ్వండి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు ఉపాధ్యాయులు ఏప్రిల్ నుంచి మొదలు పెట్టి మే, జూన్ నెలల్లో కూడా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పిల్లలకు అనేక హామీలు ఇచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుకుంటున్నాం. జూన్ నెల ప్రారంభం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అనేక బోధనేతర పనులు అప్పగించి ఉపాధ్యాయుల బోధన సమయాన్ని ప్రభుత్వమే వృథా చేస్తుంది. ఇప్పటికై నా ఉపాధ్యాయులను పాఠాలకే పరిమితం చేయాలి, బోధనేతర పనులు, యాప్‌లను ఫ్యాప్టో పక్షాన బహిష్కరిస్తున్నాం.
– మక్కెన శ్రీనివాసరావు, ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, సత్తెనపల్లి