నరసరావుపేట: జిల్లా కలెక్టర్ కృతిక శుక్లాను గురువారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ బి.కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలసి మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, పలు అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు.
నరసరావుపేట: రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన రద్దు అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా అధికారులు యథావిధిగా సీఎం పర్యటన ఏర్పాట్లు కొనసాగించాలని ఆదేశించారు. జిల్లా ప్రజలు అనధికారిక, కాల్పనిక వార్తలను విశ్వసించవద్దని విజ్ఞప్తి చేశారు.
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఉద్యోగోన్నతిపై ఎంపీడీవోలుగా నియమితులైన అధికారులకు జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా నియామక ఉత్తర్వులను అందజేశారు. గురువారం జెడ్పీ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలో పని చేస్తున్న నలుగురు ఏవోలు, ఆరుగురు డిప్యూటీ ఎంపీడీవోలకు ఎంపీడీవోలుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ విడుదల చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా నియామకపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, డీప్యూటీ సీఈవో సీహెచ్ కృష్ణ, అకౌంట్స్ అధికారి శామ్యూల్ పాల్, జీ సెక్షన్ ఏవో పూర్ణచంద్రారెడ్డి, మోహన్‌రావు పాల్గొన్నారు.
నరసరావుపేట: జిల్లాలోని ఎనిమిది బార్‌లకు ఓపెన్ కేటగిరీలో వచ్చిన 32 దరఖాస్తులకు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా లాటరీ పద్ధతిలో అభ్యర్థులకు షాపులు కేటాయించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో నరసరావుపేట మున్సిపాల్టీలో ఒకటి, చిలకలూరిపేట, పిడుగురాళ్ల మున్సిపాల్టీల్లో రెండు చొప్పున, వినుకొండ మున్సిపాల్టీలో మూడు షాపులకు కలెక్టర్ లాటరీ నిర్వహించారు. మొత్తం 30 బార్లకు రీనోటిఫికేషన్ చేయగా కేవలం ఎనిమిది బార్లకే దరఖాస్తులు వచ్చాయి. మిగిలిన బార్లకు ప్రభుత్వం మళ్లీ నోటిఫికేషన్ జారీ చేస్తుందని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి కె.మణికంఠ వెల్లడించారు. జిల్లా అసిస్టెంట్ ప్రొహిబిషన్, ఎకై ్సజ్ ఆఫీసర్ కె.రవీంద్ర, స్టేషన్‌హౌస్ ఆఫీసర్, సిబ్బంది పాల్గొన్నారు.
విజయపురి సౌత్: కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ బీపీ పాండే ఆధ్వర్యంలో సభ్యులు కేకే జాన్గిడ్ తదితరులతో కలిసి గురువారం నాగార్జునసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. సాగర్ ప్రధాన డ్యామ్, గ్యాలరీలు, రైట్ కెనాల్, పవర్ హౌస్, ప్రధాన జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించారు. స్వచ్ఛతా హీ సేవ క్యాంపెయిన్‌లో భాగంగా ప్రాజెక్టు అధికారులు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ప్రధాన డ్యాం, పైలాన్ పిల్లర్ పార్కులను శుభ్రపరిచారు. పార్కులో మొక్కలు నాటారు. శుక్రవారం లో లెవెల్ కెనాల్, లెఫ్ట్ కెనాల్‌లను సందర్శించనున్నారు. కేఆర్‌ఎంబీ ఈఈ శ్రీనివాసరావు, సాగర్ డ్యాం ఈఈ సీతారాం, డీఈ అశోక్ ఆనంద్, ఏఈ కృష్ణయ్య తదితరులు ఉన్నారు.
కలెక్టర్‌ను కలసిన ఎస్పీ
కలెక్టర్‌ను కలసిన ఎస్పీ
కలెక్టర్‌ను కలసిన ఎస్పీ