
చలో మెడికల్ కళాశాల కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
గురజాల: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం జరిగే చలో మెడికల్ కళాశాల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 90 శాతం పైగా నిర్మాణం పూర్తయిన మెడికల్ కళాశాలను కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతి ద్వారా ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమైందని అన్నారు. అందుకు నిరసనగా శాంతియుత నిరసన తెలియచేయడం జరుగుతుందన్నారు. ఉదయం 9.30 గంటలకు మెడికల్ కళళాశాల వద్దకు చేరుకుని శాంతియుతంగా నిరసన తెలియచేయడం జరుగుతుందన్నారు.