
వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేస్తే సహించం
మెడికల్ కాలేజీలను అమ్మేసుకుంటున్నారు..
గురజాల: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో నిర్మాణం చేపట్టిన వైద్య కళాశాలలను పీపీపీ విధానంతో ప్రైవేట్‌పరం చేస్తే సహించేది లేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి, పెదకూరపాడు, వినుకొండ నియోజకవర్గ పరిశీలకుడు యెనుముల మురళీధర్‌రెడ్డి, సీనియర్ నాయకుడు కొమ్మినేని వెంకటేశ్వర్లు (కేవీ)లు అన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలోని ప్రజలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో పిడుగురాళ్ల మండలంలోని బ్రాహ్మణపల్లి వద్ద మెడికల్ కళాశాలను అందుబాటులోకి తీసుకువచ్చి 90 శాతం పైగా పనులు పూర్తి చేసిన విషయాన్ని గుర్తుచేశారు. వాటిల్లో పరికరాలు సమకూర్చితే వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావచ్చన్నారు. కానీ కూటమి నాయకులు మాత్రం వాటిని ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనతో ఉన్నారన్నారు. ప్రైవేటీకరణ ఆలోచన వెనక్కి తీసుకుని వాటిని ప్రారంభించి వైద్య సేవలు, వైద్య విద్యను నిరుపేదలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. శుక్రవారం జరిగే చలో మెడికల్ కళాశాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు వి అమరారెడ్డి, పట్టణ కన్వీనర్ కె అన్నారావు, మండల కన్వీనర్ కొమ్మినేని బుజ్జి, పీర్ అహ్మద్, వేముల చలమయ్య, వంకాయలపాటి మల్లయ్య, మన్నెం ప్రసాద్; జక్కా సత్యం, వైఎస్సార్ సీపీ నాయకులు తదితరులున్నారు.
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం
పిడుగురాళ్ల: వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయటం దుర్మార్గమని వైఎస్సార్ సీపీ పట్టణ, మండల కన్వీనర్లు మాదాల కిరణ్‌కుమార్, చింతా సుబ్బారెడ్డి అన్నారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన ఏడాదిలోనే పేదవాడికి వైద్యం అందించాలని రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలను తీసుకొని వచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీటిని ప్రైవేట్ పరం చేసి వ్యాపారం చేసి జేబులు నింపుకోవాలని చూస్తుందని విమర్శించారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి మెడికల్ కళాశాలలను ప్రైవేట్‌పరం చేసే ఆలోచన ఆపకపోతే వైఎస్సార్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. శుక్రవారం వైఎస్సార్ సీపీ యువజన విభాగం, అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీని సందర్శిస్తామని తెలిపారు. కార్యక్రమం ఉదయం పిడుగురాళ్ల వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమై మెడికల్ కళాశాల వరకు కొనసాగుతుందని, అనంతరం మెడికల్ కళాశాల సందర్శిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల మాజీ కన్వీనర్ చల్లా పిచ్చిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జైలాబ్దిన్, బీసీ సెల్ మాజీ అధ్యక్షులు కందులూరి శివయ్య, జిల్లా యువజన విభాగ నాయకులు జబ్బీర్, కౌన్సిలర్లు, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.
దాచేపల్లి: కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను అమ్ముకుంటుందని జెడ్పీటీసీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. నారాయణపురంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలోనే 17 మెడికల్ కళాశాలను తెచ్చిన ఘనత నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. రూ.8వేల కోట్లు విలువ చేసే మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం అక్రమంగా ప్రైవేటీకరణ చేస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందకుండా చర్యలు తీసుకుంటుందని మండిపడ్డారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే దాదాపు అన్ని మెడికల్ కళాశాలల నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మెడికల్ కళాశాలలను పూర్తిగా విస్మరించిందని చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం తలపెట్టిన చలో మెడికల్ కళాశాల కార్యక్రమానికి భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎంపీపీ కందుల జాను మాట్లాడుతూ మెడికల్ కళాశాలను సకాలంలో పూర్తి చేస్తే వెనుకబడిన పల్నాడు ప్రాంతం ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సమావేశంలో నగర పంచాయతీ చైర్మన్ కొప్పుల సాంబయ్య, పార్టీ మండల, పట్టణ కన్వీనర్లు కోట కృష్ణ, షేక్ సుభాని, అధికార ప్రతినిధి షేక్ జాకీర్ హుస్సేన్, వైస్ చైర్మన్‌లు కొమెరాబత్తిన విజయ్‌కుమార్, వైస్ ఎంపీపీ తండా అబ్దుల్ సత్తార్, నాయకులు అనుమల రామిరెడ్డి, కొప్పుల రవి, పరిమిబాబు, ముడి విక్టర్ పాల్, కోలా జంపాలరెడ్డి, జక్కా అశోక్, షేక్ డాడీ, కుందూరు తిరుపతిరెడ్డి, ఉప్పతల ఎల్లయ్య, పాల్గొన్నారు.

వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేస్తే సహించం

వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేస్తే సహించం