
చంద్రగ్రహణం కారణంగా అమరేశ్వరాలయం మూసివేత
దాచేపల్లి : నీలకంఠేశ్వర స్వామిని తాకుతూ కృష్ణానది ప్రవహిస్తోంది. దాచేపల్లి మండలం కాట్రపాడు సమీపంలో కృష్ణా నది ఒడ్డున నీలకంఠేశ్వర స్వామి విగ్రహాన్ని గత కృష్ణా పుష్కరాల సందర్భంగా డాక్టర్ కనుమూరి క్రాంతి కుమార్, డాక్టర్ విక్రాంత్ కుటుంబ సభ్యులు ప్రతిష్టించారు. శనివారం నదిలో వరద పెరిగి నీలకంఠేశ్వర విగ్రహాన్ని తాకుతూ నీరు ప్రవహిస్తోంది. సాగర్ క్రస్ట్ గేట్ల నుంచి నీటిని విడుదల చేస్తే ఈ విగ్రహం పైనుంచి నీరు ప్రవహిస్తుంటాయి.
అమరావతి: గుంటూరు, పల్నాడు జిల్లాల సత్యసాయి సేవా సమితుల ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన తొమ్మిది వినాయక విగ్రహాలను శనివారం ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన అమరావతిలో వైభవంగా నిమజ్జనం చేశారు. గత తొమ్మిది రోజులుగా గణపతి నవరాత్రోత్సవాలను తొమ్మిది చోట్ల నిర్వహించుకుని అమరావతి వద్ద కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. ఇలా ప్రతి ఏటా నిర్వహిస్తామని అమరావతి సత్యసాయి సేవా సమితి కో–ఆర్డినేటర్ సీహెచ్ జాజిబాబు తెలిపారు. గుంటూరు జిల్లాలో జిల్లా పరిషత్ ప్రాంగణంలోని సత్యసాయి శాంతిసుధ , గుంటూరు బైపాస్ రోడ్డులోని ఆధ్యాత్మిక సామ్రాజ్యం నుంచి దుగ్గిరాల, తెనాలి, మోదుకూరు, పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట, అచ్చంపేట, అమరావతి సాయిబాబా మందిరంలో, త్రిశక్తిపీఠంలో తొమ్మిది రోజులపాటు పూజలందుకున్న తొమ్మిది ప్రాంతాలలోని తొమ్మిది విగ్రహాలను తొలుత వైభవంగా ఊరేగించి కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సభ్యులు, భక్తులు, పాల్గొన్నారు.
తెనాలి: వైకుంఠపురంలోని పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయం సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మూసివేయనున్నట్టు సహాయ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి వి.అనుపమ శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు స్వామి, అమ్మవారలకు మహానివేదన, తదుపరి అవసర నివేదన సమర్పించిన అనంతరం ఆలయం మూసివేస్తామని తెలిపారు. తిరిగి సోమవారం ఉదయం దేవాలయంలో సంప్రోక్షణలు జరిపించి ఉదయం 10 గంటల నుంచి దర్శనం, పూజలు యథావిధిగా జరుగుతాయని వివరించారు.
అద్దంకిరూరల్: ఆర్టీఐ త్వరలో ప్రారంభించనున్న వెబ్ పోర్టల్‌తో వివిధ శాఖల సమాచారాన్ని సులువుగా పొందవచ్చని రాష్ట్ర ఆర్టీఐ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆర్. మహబూబ్ బాషా తెలిపారు. శనివారం అద్దంకి వచ్చిన ఆయన స్థానిక ఆర్‌అండ్‌బీ బంగ్లాలో విలేకర్లతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖ కార్యాలయాల్లో రూ.10 స్టాంపుతో లెటర్ ద్వారా మనకి కావాల్సిన సమాచారాన్ని 30 రోజుల్లో తీసుకోవవచ్చన్నారు.

చంద్రగ్రహణం కారణంగా అమరేశ్వరాలయం మూసివేత

చంద్రగ్రహణం కారణంగా అమరేశ్వరాలయం మూసివేత

చంద్రగ్రహణం కారణంగా అమరేశ్వరాలయం మూసివేత