
మూతపడిన అమరేశ్వరాలయం
సోమవారం శ్రీ 8 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
ప్రసిద్ధ శైవ క్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయాన్ని చంద్ర గ్రహణం నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మూసివేశారు. ఉదయం రుద్రహోమం, కల్యాణం నిర్వహించారు. స్వామి వారి మహర్నీవేదన అనంతరం ఆలయాన్ని అర్చకులు మూసివేశారు. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖర శర్మ మాట్లాడుతూ సోమవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం 8 గంటలకు భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. – అమరావతి

మూతపడిన అమరేశ్వరాలయం