కూటమి పాలనలో రైతులకు కష్టాలు | - | Sakshi
Sakshi News home page

కూటమి పాలనలో రైతులకు కష్టాలు

Sep 8 2025 5:12 AM | Updated on Sep 8 2025 5:12 AM

కూటమి పాలనలో రైతులకు కష్టాలు

కూటమి పాలనలో రైతులకు కష్టాలు

కూటమి సర్కార్‌ కళ్లు తెరిపించేందుకు సన్నాహాలు

గిట్టుబాటు ధరలు లేక అప్పులపాలు

యూరియా కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి

‘అన్నదాత పోరు’ పోస్టర్‌ ఆవిష్కరణ

కూటమి సర్కార్‌ కళ్లు తెరిపించేందుకు సన్నాహాలు
ఆరుగాలం శ్రమించే రైతులకు కూటమి పాలనలో అడుగడుగునా ఘోష తప్పడం లేదు. సాగునీరు మొదలు విత్తనం, ఎరువులు, గిట్టుబాటు ధరల వరకు కన్నీరే మిగులుతోంది. పాలకుల నిర్లక్ష్యంతో కష్టాల్లో కూరుకుపోతున్నారు. అన్నదాతల తరఫున కూటమి సర్కార్‌ వైఫల్యాలను నిలదీయడానికి వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. ఇప్పటికే పలు కార్యక్రమాలు నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ఈ నెల 9వ తేదీన ‘అన్నదాత పోరు’ చేపట్టనుంది. జిల్లాలోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు, వినతిపత్రాల సమర్పణతో కూటమి పాలకుల కళ్లు తెరిపించి రైతులను ఆదుకునేలా పోరుబాట పట్టనుంది. ఈ మేరకు నియోజకవర్గాల్లో సమీక్షా సమావేశాలు, పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమాలు ఆదివారం జరిగాయి.

మాచర్ల: రాష్ట్రంలో రైతులు అన్ని రకాలుగా కష్టాలపాలవుతున్నారని వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలు ఇబ్బందులకు గురవుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ పోరుబాట పట్టిందని తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 9వ తేదీన ‘అన్నదాత పోరు’ కార్యక్రమాన్ని జిల్లాలోని ఆర్‌డీఓ కార్యాలయాల వద్ద నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం పీఆర్కే తన క్యాంపు కార్యాలయంలో భారీ ఎత్తున తరలివచ్చిన నాయకులు, కార్యకర్తల నడుమ ‘అన్నదాత పోరు’ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పత్తి, మిర్చితో పాటు అన్ని పంటలను అమ్ముకోలేక రైతులు దిగులు చెంది ఆత్మహత్య చేసుకునే దుర్భర పరిిస్థితులు నేడు నెలకొన్నాయన్నారు.

తరలి రావాలని పిలుపు

ఈ నేపథ్యంలో రైతులకు అండగా నిలబడి అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైఎస్సార్‌సీపీ నిర్ణయించిందని తెలిపారు. గురజాల ఆర్‌డీఓ కార్యాలయం వద్ద జరిగే నిరసన కార్యక్రమానికి రైతులు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. రాజీ పడకుండా రైతన్నకు అండగా ఉండే పార్టీ వైఎస్సార్‌సీపీ అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయనను కార్యాలయంలో చాలా రోజుల తరువాత కలిశారు. మార్కెట్‌ యార్డు చైర్మన్‌ ఉప్పలపాటి పెద్దబ్బాయ్‌, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ యరబోతుల శ్రీనివాసరావు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అబ్దుల్‌ జలీల్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు పోలా శ్రీనివాసరావు, జెడ్పీటీసీ పెద మల్లుస్వామి, నవులూరి భాస్కరరెడ్డి, జిల్లా నాయకులు మేకల కోటిరెడ్డి, చల్లా మట్టారెడ్డి, చుండూరు చంద్రశేఖర్‌రెడ్డి, కొంగర సుబ్రహ్మణ్యం, రాష్ట్ర యువజన విభాగ నాయకులు నవులూరి చెన్నారెడ్డి, దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ కోటిరెడ్డి, సర్పంచ్‌ ఓరుగంటి చిన్న, కౌన్సిలర్లు వేల్పుల గురవయ్య, మందా సంతోష్‌, చవ్వా బాలస్వామిరెడ్డి, జిల్లా విభాగం నాయకులు నూన్సావత్‌ రంగానాయక్‌, మున్నా మురళి, జిల్లా అధ్యక్షులు కొమ్ము చంద్రశేఖర్‌, అల్లయ్య, జెడ్పీటీసీ షఫి, మాజీ ఎంపీపీ సంపూర్ణమ్మ, ఎస్‌సీ విభాగ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాచర్ల సుందరరావు, పార్టీ నాయకులు పిన్నెల్లి హనిమిరెడ్డి, కందుకూరి మధు, యేరువ ప్రతాపరెడ్డి, తాళ్ళపల్లి ఈశ్వరయ్య, వెంకట్రామయ్య, మోరా రామకృష్ణారెడ్డి, బొంగురు, అగ్గిరాముడు, కంభంపాటి అమర్‌, మద్దికర శ్రీనివాసరెడ్డి, జిల్లా విభాగం మహిళా నాయకురాలు అనంతరావమ్మ, ధనలక్ష్మి, చల్లా మోహన్‌, మాజీ ఎంపీపీ పోతురెడ్డి కోటిరెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అబ్దుల్‌ జలీల్‌, జిల్లా మహిళా విభాగం నాయకురాలు అనంతరావమ్మ, జిల్లా బీసీ యువజన విభాగం నాయకులు పిల్లి కొండలు, జెడ్పిటీసీ పెద్ద మల్లుస్వామి, దేవళ్ళ సాంబశివరావు, కొత్తపల్లి పున్నారెడ్డి, కౌన్సిలర్‌ మందా సంతోష్‌, దేవళ్ళ సాంబశివరావు, చల్లా కాశయ్య, చల్లా మోహన్‌, బాలమ్మ, సంపూర్ణ, ఆకుల శ్రీనివాస నాయుడు, దేవళ్ళ యోగయ్య, గుంజ నాగ అంజి, తిరుమల కొండ దుర్గారావు, బత్తుల శ్రీనివాసరావు, వల్లెపు దుర్గారావు, బొంగురు, అగ్గిరాముడు, ఎం.పాపిరెడ్డి, బిజ్జం సుధాకర్‌రెడ్డి, ప్రతాపరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement