ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే తురకపాలెం ఘటన | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే తురకపాలెం ఘటన

Sep 7 2025 7:46 AM | Updated on Sep 7 2025 7:46 AM

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే తురకపాలెం ఘటన

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే తురకపాలెం ఘటన

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే తురకపాలెం ఘటన

గ్రామంలో బెల్ట్‌ దుకాణాల ద్వారా ఏరులై పారుతున్న మద్యం అత్యంత అధ్వానంగా పారిశుద్ధ్య నిర్వహణ కలుషిత తాగునీటితో ప్రజలకు ఆరోగ్య సమస్యలు బాధిత కుటుంబాలకు అండగా వైఎస్సార్‌ సీపీ

గుంటూరురూరల్‌:తురకపాలెం గ్రామంలో పలువు రు కేవలం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే మృతి చెందారని వైఎస్సార్‌సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గం ఇన్‌చార్జి బలసాని కిరణ్‌కుమార్‌ ఆరోపించారు. శనివారం గ్రామంలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతులకు నివాళులర్పించారు. ప్రతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, న్యాయం జరిగే వరకూ పోరాడదామని భరోసా కల్పించారు. బలసాని మాట్లాడుతూ గ్రామంలో తాగునీరు ప్రజలకు అందటం లేదన్నారు. కానీ మద్యం మాత్రం ఏరులై పారుతోందన్నారు. చిన్నపాటి గ్రామంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నాలుగు బెల్ట్‌ షాపులు వెలిశాయని పేర్కొన్నారు. ఇంటి దగ్గరే మద్యం దొరుకుతుండటంతో అందరూ వాటికి అలవాటు అవుతారన్నారు.

మెరుగైన వైద్యసేవలు కీలకం

కలుషిత తాగునీరు, పారిశుద్ధ్యం లోపం, అక్రమ మద్యం విక్రయ దుకాణాలు వంటి వాటి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంచాయతీ అధికారులు దీనికి బాధ్యత వహించాలన్నారు. స్పెషలిస్ట్‌ వైద్యులతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్‌ చేశారు. ప్రతి ఇంటిని మినరల్‌ వాటర్‌ను అందించాలన్నారు. మృతి చెందిన ప్రతి కుటుంబానికి వెంటనే ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని పేర్కొన్నారు. ప్రతి రోజు పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఇంటూరి పద్మావతి అంజిరెడ్డి, మండల కన్వీనర్‌ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, పిల్లి మేరి, పెద్దిరెడ్డి సామ్రాజ్యం, మెట్టు వెంకటప్పారెడ్డి, దారం అశోక్‌కుమార్‌, వెంకటరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement