
పీపీపీ విధానంలో మెడికల్ కళాశాల నిర్మాణం వద్దు
బాపట్ల: రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ మాచవరపు రవికుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విద్యార్థి విభాగం సమావేశం నిర్వహించారు. రవికుమార్ మాట్లాడుతూ ఈ మేరకు ఈనెల 7వ తేదీన విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్లకు వినతిపత్రాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రైవేటు భాగస్వామ్యంతో కళాశాలలు నిర్మాణం జరిగితే పేదవానికి వైద్యం సకాలంలో అందే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి పేదవాడికి కార్పొరేట్ విద్య అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలను నిర్వీర్యం చేసేందుకు కూ టమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సమావేశంలో బాపట్ల జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు యల్లావుల సోహిత్ యాదవ్, పర్చూరు నియోజకవర్గ అధ్యక్షులు కాటి లక్ష్మణ్, రాష్ట్ర విద్యార్థి విభాగం కమిటీ జాయింట్ సెక్రటరీ షేక్ పర్వే జ్, రేపల్లె అధ్యక్షులు వసీం మొహమ్మద్, చీరాల అధ్యక్షులు గోనబోయిన వెంకటేష్, జిల్లా విద్యార్థి యువ నాయకులు చోప్రా రాజశేఖర్ ఉన్నారు.
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం
జనరల్ సెక్రటరీ రవికుమార్