బెంగళూరు ఐఐఎస్సీలో చేరతాను
మా స్వస్థలం గుంటూరు. నాన్న కిషోర్ చౌదరి ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తుండగా, అమ్మ పద్మజ ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మినిస్ట్రేటర్‌గా పని చేస్తున్నారు. జేఈఈ మెయిన్స్‌లో 100 పర్సంటైల్‌తో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 18వ ర్యాంకు సాధించాను. జేఈఈ అడ్వాన్స్‌డ్ సాధించిన 152వ ర్యాంకు ఆధారంగా బెంగళూరు ఐఐఎస్సీలో బీటెక్‌లో మాథమాటిక్స్ ఇన్ కంప్యూటర్స్ కోర్సులో జాయిన్ అవుతాను.
– గుత్తికొండ సాయిమనోజ్ఞ, 98వ ర్యాంకు, ఇంజినీరింగ్
బెస్ట్ ఐఐటీలో సీఎస్‌ఈ
చదువుతా..
మా స్వస్థలం గుంటూరు నగరంలోని ముత్యాలరెడ్డినగర్. నాన్న వీర వరప్రసాదరావు పొన్నెకల్లు జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు. అమ్మ రాజ్యలక్ష్మి ప్రత్తిపాడు జెడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయినిగా పని చేస్తున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో వచ్చిన 391వ ర్యాంకు ఆధారంగా ఏదైనా బెస్ట్ ఐఐటీలో సీఎస్‌ఈ చదవాలని ఉంది.
– విన్నకోట మహేష్‌చంద్ర,56వర్యాంకు, ఇంజినీరింగ్
బెంగళూరు ఐఐఎస్సీలో చేరతాను


