తిరుపతమ్మ ఆలయానికి విరాళం
తాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని వడ్డేశ్వరంలో ఉండే యువకుడు బకింగ్‌హామ్ కెనాల్‌లోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా, గల్లంతైన సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాడేపల్లి ఎస్‌ఐ ఖాజావలి తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డేశ్వరానికి చెందిన నాగూర్, షంషుద్దీన్‌ల పెద్ద కుమారుడు గఫూర్ (25) బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఆరోగ్య సమస్యలతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. గ్రామంలోనే ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. మానసిక పరిస్థితి సరిగా లేదు. శనివారం సాయంత్రం వడ్డేశ్వరం నుంచి బకింగ్‌హామ్ కెనాల్ దాటే బ్రిడ్జిపై ద్విచక్ర వాహనాన్ని పెట్టి కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా, గల్లంతయ్యాడు. అతని ఆచూకీ కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు గాలిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. తెల్లవారుజాము నుంచి ఉదయం 11 గంటల వరకు రద్దీ సాధారణంగా ఉండగా, మధ్యాహ్నం 12 గంటల నుంచి అనూహ్యంగా పెరిగింది. దీంతో ఘాట్‌రోడ్డుపైకి కార్లు, ఇతర వాహనాలను అనుమతించలేదు. కేవలం భక్తుల ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతించారు. ఆదివారం కావడంతో శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున ఖడ్గమాలార్చన, ఉదయం లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, శాంతి కల్యాణం, చండీహోమానికి రద్దీ కనిపించింది. మరో వైపున పెద్ద ఎత్తున భవానీలు అమ్మవారిని దర్శించుకుని ఇరుముడులను సమర్పించారు.
ఘాట్‌రోడ్డు క్యూలో రద్దీ..
అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఘాట్‌రోడ్డు మీదగా కొండపైకి చేరుకున్నారు. మహా నివేదన అనంతరం మహామండపం మీదగా వచ్చే భక్తుల రద్దీ సాధారణంగా ఉండగా, ఘాట్‌రోడ్డు మార్గంలో భక్తుల తాకిడి కనిపించింది. పల్స్‌పోలియోను పురస్కరించుకుని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పోలియో చుక్కలు వేశారు.
తిరుపతమ్మ ఆలయానికి విరాళం
తిరుపతమ్మ ఆలయానికి విరాళం


