నాలుగున్నర కిలోల గంజాయి స్వాధీనం
పిడుగురాళ్ల: పిడుగురాళ్ల పట్టణం ఎస్టీ కాలనీలో నాలుగున్నర కిలోల గంజాయిని పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఇద్దరు మహిళలు ఇంట్లో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి ఆ ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం. పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావును వివరణ కోరగా గంజాయిని పట్టుకున్న మాట వాస్తవమేనని, కానీ తహసీల్దార్ అందుబాటులో లేకపోవటం వలన వివరాలు వెల్లడించలేదని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
పోలీసులు అదుపులో ఇద్దరు మహిళలు


