10న జిల్లా సీనియర్స్ మెన్, ఉమెన్ ఫుట్‌బాల్ జట్ల ఎం
సత్తెనపల్లి: ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెన్ అండ్ ఉమెన్ జిల్లా సెలక్షన్ ట్రయల్స్ ఈ నెల 10న ఉదయం 9 గంటలకు సత్తెనపల్లి సుగాలీకాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరుగుతాయని పల్నాడు జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.సుబ్రహ్మణ్యేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెలక్షన్ ట్రయల్స్‌కు వచ్చు క్రీడాకారులు వారి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కా ర్డు ఒరిజినల్స్, జిరాక్స్ కాపీలు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకొని రావా లన్నారు. ఇతర వివరాలకు సెల్ నెంబర్ 7396967776లో సంప్రదించాలన్నారు.
ఎస్‌జీటీలకు వెబ్ కౌన్సెలింగ్ రద్దుచేయాలి
సత్తెనపల్లి: ఎస్‌జీటీలకు వెబ్ కౌన్సెలింగ్ రద్దుచేసి మాన్యువల్‌గా జరపాలని సత్తెనపల్లి ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని మండల విద్యాశాఖఅధికారి కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఎస్‌జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ జరపాలని, వెబ్ కౌన్సెలింగ్ రద్దు చేయాలని ఈ నెల 8న గుంటూరులోని ఉమ్మడి జిల్లా డీఈఓ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని కోరారు. ఈ మేరకు సత్తెనపల్లి ఎంఈఓ ఏ.శ్రీనివాసరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎస్‌ఎం.సుభాని, చిన్నం శ్రీనివాసరావు, శివారెడ్డి, రహమాన్, విష్ణు, సుబ్బు, సురేష్, అప్పారావు, కాపు నర్సింహారావు, రాఘవ, ధర్మారావు, రామారావు తదితర ఉపాధ్యాయులు ఉన్నారు.
మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించండి
శావల్యాపురం: సెకండరీ గ్రేడు ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఎస్టీయూ మండల ప్రధాన కార్యదర్శి బిళ్ళా రాజారమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ శనివారం చేశారు. ఇదే విధానాన్ని కొనసాగించాలని నిరసన తెలుపుతూ ఉపాధ్యాయ సంఘూల ఐక్యవేదిక ఆధ్వర్యంలో (ఫ్యాక్టో) నేడు ఉదయం డీఈవో కార్యాలయం ముట్టడించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


