నరసరావుపేట: మహిళలు భద్రతకు శక్తి యాప్ రక్షణ కవచంలా పనిచేస్తుందని అదనపు ఎస్పీ(పరిపాలన) జేవీ సంతోష్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహి ళలు, బాలికల భద్రత కోసం తీసుకొచ్చిన శక్తి యాప్‌ౖ పె అవగాహన నిమిత్తం మంగళవారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ స్కూలు విద్యార్థినులతో స్వీయ రక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ సంతోష్ మాట్లాడుతూ ప్రతీ ఒక్క మహిళ తమ ఫోన్‌లో యాప్ నిక్షిప్తం చేసుకుని ఆపద సమయంలో పోలీసు వారి తక్షణ సహాయం పొందాలని సూచించారు. అనంతరం యాప్‌ను ఉపయోగించే విధానం వివరించారు. అదేవిధంగా విద్యార్థి దశ నుంచి వారి మనోధైర్యాన్ని పెంపొందించుటకు కావాల్సిన స్వీయరక్షణ మెలకువలను కరాటే ద్వారా ఎదుర్కొనే విధానాలను నిపుణులు ప్రదర్శించారు. మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ వెంకట రమణ, మహిళా పోలీస్ సిబ్బంది, శంకర భారతిపురం, తిలక్ స్కూలుకు చెందిన 500మంది విద్యార్థినులు పాల్గొన్నారు.