
ఖోఖో పోటీలను ప్రారంభిస్తున్న మైనీడి శ్రీనివాసరావు
ప్రారంభమైన వర్సిటీ అంతర్ కళాశాలల ఖోఖో పోటీలు
నరసరావుపేట ఈస్ట్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉండాలని విక్టరీ డిగ్రీ కళాశాల డైరెక్టర్ మైనీడి శ్రీనివాసరావు తెలిపారు. కళాశాల క్రీడా మైదానంలో ఆదివారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పురుషుల ఖోఖో పోటీలను ఆయన ప్రారంభించి మాట్లా డారు. క్రీడా స్ఫూర్తి అలవడిన విద్యార్థులు గెలు పు ఓటములను సమానంగా స్వీకరించి జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు అవసరమైన ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటారని తెలిపారు. శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ అలవడుతుందని తెలిపారు. కాగా వర్సిటీ పరిధిలోని కళాశాలల నుంచి ఎనిమిది జట్లు పోటీలో పాల్గొన్నాయి. నాకౌట్ కం లీగ్ పద్ధతిలో నిర్వహిస్తున్న పోటీలో నరసరావుపేటకు చెందిన విక్టరీ, కృష్ణవేణి, వాగ్దేవి డిగ్రీ కళాశాలలతో పాటు ఇంకొల్లుకు చెందిన ఎస్‌డీసీ ఆర్‌ఎం డిగ్రీ కళాశాల లీగ్ దశకు చేరుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి వి.సుబ్బారెడ్డి, ప్రిన్సిపల్ పి.వేణుగోపాల్, భవనా కళాశాల ప్రిన్సిపల్ రామచంద్రారెడ్డి, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్. కృష్ణంరాజు పాల్గొన్నారు.