
మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ పీఆర్కే. వేదికపై ఇతర నేతలు
మాచర్ల: రాష్ట్రంలో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. పట్టణంలో గుంటూరు రోడ్డులో ఆర్యవైశ్య పట్టణ, యువజన సంఘాల ఆధ్వర్యంలో మహాలక్ష్మీ కోల్డ్ స్టోరేజీ ఎదురుగా ఏర్పాటు చేసిన మాచర్ల నియోజక వర్గ ఆర్యవైశ్య కార్తిక వన సమారాధన ఆత్మీయ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆర్యవైశ్యులు నిర్మించుకున్న సత్రాలకు వారికే హక్కు కల్పించటం, కార్పొరేషన్ చైర్మన్ పదవితో పాటు, టీటీడీ బోర్డులో పలువురికి పదవులిచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. ఈసారి ఆర్యవైశ్యులకు మున్సిపల్ చైర్మన్ పదవిని కేటాయిస్తామన్నారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, ఆర్‌టీఐ కమిషనర్ రేపాల శ్రీనివాసరావులు మాట్లాడుతూ మహానేత డాక్టర్ వైఎస్సార్, అదేస్థాయిలో ఆర్యవైశ్యులకు అవకాశాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుందన్నారు. తామంతా ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి సీఎం జగన్ ఆశీస్సులు, ఆర్యవైశ్యుల అండదండలు కారణమన్నారు. కార్యక్రమంలో 5 వేల మందికి వనసమారాధన నిర్వహించారు. ఆత్మీయ భోజన కార్యక్రమానికి పట్టణ అధ్యక్షులు పోలా శ్రీనివాసరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ పోలూరి నరసింహారావు, వాసవీ సత్రాల సలహా మండలి సభ్యులు చిల్లంచర్ల సత్యనారాయణ, కంభంపాటి అమర్ అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీలక్ష్మీ చెన్నకేశవ ట్రస్టు బోర్డు చైర్మన్ గోపవరపు నాగేశ్వరరావు, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ కొత్తమాసు పాండు రంగారావు, వాడపల్లి లక్ష్మీ నరసింహ స్వామి వాసవీ సత్ర అధ్యక్షులు మాశెట్టి బుజ్జి, రంగా చెన్నయ్య, మారం వాసు, కొత్తమాసు బ్రహ్మారావు, తిరివీధి వెంకట నాగేశ్వరరావు, చుండూరు శ్రీనివాసరావు, కజ్జం గురవయ్య, ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొన్నారు.
ఆర్యవైశ్యుల అభివృద్ధికి జగనన్న ఎంతో కృషి చేశారు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి