హత్యాయత్నం కేసులో కంచేటి సాయి అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న సీఐ బ్రహ్మం - Sakshi

పెదకూరపాడు: మునుగోడులో ఓ వ్యక్తిపై జరిగిన హత్యాయత్నం కేసులో సూత్రధారిగా ఉన్న కంచేటి సాయిని అమరావతి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అమరావతి సీఐ బ్రహ్మం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మునగోడు గ్రామానికి చెందిన అబ్బినేని వెంకట నరసయ్య, అలియాస్‌ నాని, కొలికొండ వెంకటరావు, మేడ దుర్గారావు, కోనంకి వెంకట శివరావు, నల్లగొర్ల వెంకటేశ్వర్లు, కుంభా తాతారావు, మేడ ఏడుకొండలు, తాడిబోయిన మల్లికార్జునరావులు వాహనాల్లో ఆయిల్‌ దొంగతనం చేస్తుంటారు. ఈ క్రమంలో మునగోడు గ్రామానికి చెందిన గనపా సైదారెడ్డికి చెందిన వాహనంలో ఆయిల్‌ చోరీకి పాల్పడుతూ పట్టుబడ్డారు. ఆయిల్‌ దొంగలు సైదారెడ్డిని హత్య చేసేందుకు ఏప్రిల్‌ ఐదో తేదీన కారుతో ఢీకొట్టారు. సైదారెడ్డి ప్రాణాలతో తప్పించుకోని ఏప్రిల్‌ ఆరో తేదీన అమరావతి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. సైదారెడ్డి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా కేసు ఎ–1, ఎ–3, ఎ–4గా ఉన్న నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. మరి కొంతమంది నిందితులు ముందస్తు బెయిల్‌ పొందారు. కేసులో ఎ–5గా ఉన్న కోనంకి వెంకట శివరావుని పోలీసులు విచారించారు. క్రోసూరు మండలం పీసపాడు గ్రామానికి చెందిన కంచేటి సాయికి సైదారెడ్డికి గతంలో ఇసుక అక్రమంగా తరలించే విషయంలో గొడవలు ఉన్నాయి. ఇసుక అక్రమంగా తరలిస్తున్న సాయికి చెందిన వాహనాలను ఎస్‌ఈబీ అధికారులకు సమాచారం ఇచ్చి పట్టించాడు. ఈ క్రమంలో కంచేటి సాయి నిందితులను కలిసి సైదారెడ్డిని హత్య చేస్తే ఆర్థికంగా తన వంతు సహాయం ఇస్తానని చెప్పాడు. సైదారెడ్డిని హతమార్చేందుకు ప్రయత్నించినట్లు విచారణలో వెల్లడికావడంతో గుంటూరులోని తన నివాసం వద్ద కంచేటి సాయిని శుక్రవారం అరెస్టు చేసి సత్తెనపల్లి కోర్డుకు హాజరుపర్చినట్లు సీఐ తెలిపారు.

హత్యాయత్నంకు సూత్రధారిగా విచారణలో వెల్లడి

గతంలో ముగ్గురు అరెస్టు, రిమాండ్‌

Read latest Palnadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top