మా సప్న కనిపించడం లేదు.. | Asha WorkerMissing From One Week In Malkangiri District | Sakshi
Sakshi News home page

మా సప్న కనిపించడం లేదు..

Jul 13 2021 7:33 AM | Updated on Jul 13 2021 7:48 AM

Asha WorkerMissing From One Week In Malkangiri District - Sakshi

మల్కన్‌గిరి: పోడియ సమితిలో ఆశావర్కర్‌గా పనిచేస్తున్న సప్నభయ్య అనే మహిళ అదృశ్యమైందని, ఆమె భర్త జగదీష్‌ భయ్య సోమవారం పోడియ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 3వ తేదీ నుంచి సప్న కనిపించడం లేదని, కొత్తగుఢ గ్రామంలో మహిళకు ప్రసవం ఉందని చెప్పి వెళ్లిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సాయంత్రమైనా రాకపోవడం, సెల్‌ఫోన్‌ స్విచాఫ్‌ ఉండడంతో ఆమె తల్లిదండ్రులకు సమాచారమిచ్చాడు. ఆపై భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాప్‌ కోణంలో విచారణ చేపట్టారు.  

Advertisement
 
Advertisement
Advertisement