కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లాలో ఏకై క శక్తి పీఠం మా బండారు ఘరణి శక్తి పీఠం ప్రధాన అర్చకుడు రాజీవ్ లోచన్ పూజారి (54) ఆకస్మికంగా మృతి చెందారు. జిల్లా కేంద్రంలోని కేవిటి వీధిలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. జిల్లాలో అతి ముఖ్యమైన శక్తిపీఠానికి ప్రధాన అర్చకుడు కావడంతో జిల్లా వ్యాప్తంగా విచారచ్చయాలు నెలకొన్నాయి. దసరా శరన్నవరాత్రులకు శక్తి పీఠం సిద్ధమవుతున్న తరుణంలో ఆయన మృతి వార్త అన్ని వర్గాలను శోకంలో ముంచేసింది. గురువారం ఉదయం జిల్లా కేంద్రంలో వర్తక వాణిజ్య సంస్థలు తెరువలేదు. బీజేపీకి చెందిన నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి రాజీవ్ నివాసానికి చేరుకొని పూల మాలల వేసి నివాళులు అర్పించారు. మాజీ మంత్రి రమేష్ మజ్జి, ఎంపీ బలబద్ర మజ్జి తదితరులు తమ సంతాపాలు ప్రకటించారు. అంతిమ యాత్ర లో పార్టీలకు అతీతంగా ప్రజలు పాల్గొన్నారు. అంతిమ సంస్కారాలు ముగిసే వరకు మున్సిపల్ చైర్మన్ కున్ను నాయకు అనుసరించారు. రాజీవ్ కుటుంబం శతాబ్దాలుగా శక్తి పీఠానికి వంశ పార పర్య ప్రధాన అర్చకులుగా కొనసాగుతున్నారు.


