రాయగడ: జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అధ్యక్షతన జిల్లాలోని రామనగుడ సమితి కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌సెల్ నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన వారి నుంచి 51 వినతులను అధికారులు స్వీకరించారు. ఇందువో 48 వ్యక్తి గత సమస్యలుగా గుర్తించిన అధికారులు మరో ముగ్గురికి రెడ్ క్రాస్ నిధుల నుంచి 25 వేల రూపాయల ఆర్థిక సహకారాన్ని అందించారు. అలాగే పశుసంపద అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 2026 –27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గోపాలన, పశుగ్రాస అభివృద్ధి, మేకలు, కోళ్ల పెంపకం లబ్ధిదారులకు వర్క్ ఆర్డర్లను కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండో, గుణుపూర్ సబ్‌కలెక్టర్ దుదూల్ అభిషేక్ దిల్లీప్, జిల్లా విదాశాఖ అధికారి భజన్ లాల్ మాఝి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆసీమారావ్, గుణుపూర్ ఎస్‌డీపీవో బబులా నాయక్, బీడీవో ప్రద్యుమ్న మండల్ పాల్గొన్నారు.


