గోవధను వ్యతిరేకిస్తూ ఆందోళన | - | Sakshi
Sakshi News home page

గోవధను వ్యతిరేకిస్తూ ఆందోళన

Jul 28 2026 1:36 AM | Updated on Jul 28 2026 1:36 AM

పర్లాకిమిడి: గోహాత్యలను బంద్‌ చేయాలని, గోసురక్షా, గోసమ్మాన్‌ ఆహ్వాన్‌ అభియాన్‌ ఆధ్వర్యంలో జిల్లా అటవీ డివిజనల్‌ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు గోసురక్షా సమితి, భజరంగ్‌ దళ్‌, విశ్వహిందూ పరిషత్‌ నాయకులు సోమవారం ర్యాలీ చేపట్టారు. గోవులను కబేళాలకు తరలిస్నున్న వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని, గజపతి జిల్లాలో గోశాలలు నిర్మించాలని, గోఅభయారణ్యాలు ఏర్పాటు చేయాలన్న పలు డిమాండ్లతో కలెక్టరేట్‌ వద్ద ఆందోళన జరిపారు. అనంతరం రాష్ట్రపతి, ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మఝికి రాసిన వినతిని ఆదనపు జిల్లా మాజిష్ట్రేట్‌ ఫల్గుణి మఝికి అందజేశారు. ఈ ఆందోళనలో గోసమ్మాన్‌ జిల్లా అధ్యక్షుడు గిన్నికుమార్‌ రెడ్డి, గోసమ్మాన్‌ జిల్లా కార్యదర్శి రమేష్‌ పాత్రో, మనోజ్‌ దాస్‌, నరేంద్ర కుమార్‌ జన్ని, సత్యనారాయణ సాహు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement