పక్కాగా ఎన్నికల జాబితా | - | Sakshi
Sakshi News home page

పక్కాగా ఎన్నికల జాబితా

Jul 24 2026 2:15 AM | Updated on Jul 24 2026 2:15 AM

పర్లాకిమిడి: కేంద్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఎస్‌ఐఆర్‌–2026 గజపతి జిల్లా రాష్ట్రంలో కెల్లా ముందుండగా.. గురువారం గజపతి జిల్లా ఎస్‌ఐఆర్‌ పర్యవేక్షకులు, ఇడ్కో ఎండీ డి.ప్రశాంత్‌ కుమార్‌ రెడ్డి పర్లాకిమిడి కలెక్టరేట్‌లో ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎస్‌ఐఆర్‌– 2026 పురోగతి, ఓటర్ల జాబితా, వివిధ ఓటర్ల పేర్లు సంసోధన, డిజిటలైజేషన్‌, బూత్‌ లెవల్‌ కార్యకలాపాలు, ఆ తరువాత జరుగబోయే తుది ఓటర్ల జాబితాపై పర్యవేక్షకులు ప్రశాంత్‌ కుమార్‌ రెడ్డి అధికారులతో మాట్లాడారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి అక్షయ సునీల్‌ అగర్వాల్‌, ఏడీఎం. ఫల్గునీ మఝి, డెప్యూటీ కలెక్టర్‌ (ఎలక్షన్‌) అమిత్‌ బిశ్వాల్‌, ఏడీఎం (రెవెన్యూ) మునీంద్ర హానగ, సబ్‌ కలెక్టర్‌ అనుప్‌ పండా, డిప్యూటీ కలెక్టర్‌ సుచిస్మితా మఝి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నబకిశోర్‌ శోబోరో, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు బి.జనార్దనరావు, ప్రభుత్వ ఎన్నికల అధికారి మనోజ్‌ పట్నాయిక్‌, తదితరులు పాల్గొన్నారు.

గజపతిజిల్లాలో రెండు నియోజకవర్గాలు మోహానా, పర్లాకిమిడికి ఆగస్టు 4వ తేదీ వరకు ఓటర్లు తమ పేర్లులేనిచో సంబంధిత ఫారంలో దాఖలు చేసుకోవచ్చని, తుది ప్రక్రియ అనంతరం సెప్టెంబరు 6వ తేదీ తుది ఓటరు జాబితా పబ్లిష్‌ అవుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement