కేరళంలో మల్కన్‌గిరి జిల్లా యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

కేరళంలో మల్కన్‌గిరి జిల్లా యువకుడు మృతి

Jul 23 2026 1:54 AM | Updated on Jul 23 2026 1:54 AM

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా ఖోయిర్‌పూట్‌ సమితి బొండఘటీ ప్రాంతం ముదిలిపోడ పంచాయతీ కిర్సన్‌గూడ గ్రామానికి చెందిన శుక్ర శిసా (26) యువకుడు కేరళంలో మృతి చెందారు. కిర్సన్‌గూడ గ్రామానికి చెందిన శుక్ర శిసాతోపాటు మరో ముగ్గురు ఈ నెల 15వ తేదీన కూలి పనుల కోసం కేరళంకు వలస వెళ్లారు. అయితే 18వ తేదీన శుక్ర శిసా ఆరోగ్యం ఆకస్మికంగా క్షీణించింది. 19వ తేదీ తెల్లవారు జామున మృతి చెందాడు. ఈ విషయాన్న అతనితోపాటు వెళ్లినవారు శుక్ర శిసా కుటుంబ సభ్యులకు ఫోన్‌ద్వారా తెలియజేశారు. దీంతో ఇక్కడ ముదిలిపోఢ పోలీసుస్టేషన్‌లో కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. దీంతో ఇన్‌స్పెక్టర్‌ నీలిమా పాణిగ్రాహి కేసు నమోద్‌ చేసి ఇక్కడ నుంచి దర్యాప్తు కోసం ఓ బృందం కేరళాకు పంపించారు. వీరు బుధవారం బుదవారం కేరళ చేరుకున్నారు. శుక్ర మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.

గంజాయి స్వాధీనం

యువకుడు అరెస్టు

రాయగడ: ఝార్సుగుడ జిల్లా లఖన్‌పూర్‌ పోలీసులు జాతీయ రహదారిపై నిర్వహించిన వాహన తనిఖీల్లో గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టయింది. ఓ యువకుడు గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. ఇతని నుంచి 5.296 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒక యువకుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఎస్‌పీ జి.ఆర్‌.రాఘవేంద్ర మీడియా ప్రతినిధులకు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం నాడు ఎస్సై రస్మి ఓరం నేతృత్వంలో బృందం బెహరాగుడ కూడలి సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుంది. ఈ సమయంలో నల్లరంగు ఎయిర్‌ బ్యాగ్‌తో అనుమానస్పదంగా అధిక వేగంతో వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తించిన పోలీసులు వెంటాడి నువాబంద్‌ కూడలి వద్ద అడ్డుకున్నారు. వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి అజయ్‌ కుమార్‌ నాయక్‌గా గుర్తించిన పోలీసులు అతని బ్యాగ్‌ను తనిఖీ చేయగా అందులో గంజాయి పట్టుబడింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కోర్టుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement