రమాదేవికి నివాళులు | - | Sakshi
Sakshi News home page

రమాదేవికి నివాళులు

Jul 23 2026 1:54 AM | Updated on Jul 23 2026 1:54 AM

భువనేశ్వర్‌: స్వాతంత్య్ర సమరయోధురాలు, సంఘ సంస్కర్త, మహిళా నాయకురాలు రమాదేవీ చౌదరి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్ర శాసన సభ సమీపంలోని ఆమె విగ్రహానికి స్పీకర్‌ సురమా పాఢి ఉప ముఖ్యమంత్రి కనక వర్ధన్‌ సింగ్‌దేవ్‌ తదితర ప్రముఖులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

విజిలెన్స్‌ వలలో

ఓఏవీ ప్రిన్సిపాల్‌

కొరాపుట్‌: ఒడిశా ఆదర్శ విద్యాలయ ప్రిన్సిపాల్‌ విజిలెన్స్‌ వలకు చిక్కారు. బుధవారం కలహండి జిల్లా త్వమల్‌ రాంపూర్‌లో ఓఏవీ ప్రిన్సిపాల్‌ సీతాకాంగ్‌ రణా రూ.10 వేలు లంచం తీసుకుంటూ విజిలెన్స్‌ అధికారులకు పట్టుబడ్డారు. విద్యాలయంలో పారిశుద్ధ్యం, ఇతర పనులను స్వయం సేవా గ్రూపు నిర్వహిస్తోంది. వారికి మూడు నెలలుగా బిల్లుల చెల్లింపులు జరగలేదు. వాటిని క్లియరెన్స్‌ చేయాలంటే ప్రిన్సిపాల్‌ సంతకం అవసరం. అందుకు రణా రు.10 వేలు డిమాండ్‌ చేశారు. దాంతో బాధితులు కొరాపుట్‌ విజిలెన్స్‌ కార్యాలయాన్ని సంప్రదించారు. అక్కడి సిబ్బంది సూచన మేరకు రణకి లంచం ఇస్తుండగా పట్టుకున్నారు. అనంతరం అతని ఆస్తులు లక్ష్యంగా సోదాలు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement