ఖోయిర్‌పూట్‌ సమితి గ్రీవెన్స్‌కు 63 వినతులు | - | Sakshi
Sakshi News home page

ఖోయిర్‌పూట్‌ సమితి గ్రీవెన్స్‌కు 63 వినతులు

Jul 21 2026 12:41 AM | Updated on Jul 21 2026 12:41 AM

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా ఖోయిర్‌పూట్‌ సమితి బోడడూరాల్‌ పంచాయతీలో జిల్లా కలెక్టర్‌ ప్రధమేశ్‌ అర్వింద్‌ రాజశిర్కే ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా 63 వినతులను అధికారులు స్వీకరించారు. వాటిలో కొన్ని వ్యక్తిగత సమస్యలుగా గుర్తించగా.. మిగతా గ్రామ, రహదారి సమస్యలతోపాటు ఆరోగ్య, విద్యా పరమైన సమస్యలు పరిష్కరించాలని ఉన్నాయి. వీటిని పరిష్కరించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించారు. జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దశరథి సరాబు, జిల్లా సబ్‌ కలెక్టర్‌ దురోధ్యన్‌ బోయి, ఇతర శాఖల అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement