జయపురం: నాన్–గెజిటెడ్ ఫారెస్ట్ సర్వీసెస్ అసోసియేషన్ జయపురం ఖెందూలీప్ డివిజన్(కెఎల్‌డివిజన్) సంఘ సర్వసభ్య సమావేశం సోమవారం జయపురంలో జరిగింది. కె.ఎల్ డివిజన్ జయపురం అధ్యక్షుడు శబీర కుమార్ జెన అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఒడిశా రాష్ట్ర నాన్–గెజిటెడ్ ఫారెస్ట్ సర్వీసెస్ అసోసియేషన్ ఉపాధ్యాయులు మలయ రంజన్ మల్లిక్ పాల్గొన్నారు. జిల్లాలో కొత్తగా నియమితులైన ఫారెస్టర్లను ఘన స్వాగతం పలికారు. సంఘానికి సంబంధించిన వివిధ సంస్థాగత, ఉద్యోగుల సంక్షేమం, సేవా సంబంధిత సమస్యలపై సమావేశంలో విస్తృత చర్చలు జరిపారు. ఈ సమస్యలు పరిష్కరించాలని సమావేశం తీర్మానించింది. ఈ చర్చల్లో నాన్–గెజిటెడ్ ఫారెస్ట్ సర్వీసెస్ అసోసియేషన్ కొరాపుట్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ ప్రధాన్, ఉపాధ్యక్షుడు గోవింద నాయక్, కోశాధికారి మనోజ్ మహరాణ, రాష్ట్ర సంఘ ప్రతినిధి ఽధీరేష్ శతపతి, కొరాపుట్ టెరిటోరియన్ డివిజన్ అధ్యక్షుడు నిరంజన్ ప్రధాన్, జయపురం కెఎల్ డివిజన్ కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి లోకేష్ మరండి, కోశాధికారి రోహిత్ షరాబ్, సంయుక్త కార్యదర్శి జగదీష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


