విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

Jul 20 2026 1:08 AM | Updated on Jul 20 2026 1:08 AM

పలాస: విద్యార్థులు, యువజనుల న్యాయబద్ధమైన సమస్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వివిధ ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద దీక్ష చేపడుతున్న సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌ చుక్‌ను అక్రమంగా తరలించడాన్ని ప్రజలంతా ఖండించాలని పిలుపునిస్తూ పలాస మండలం బొడ్డపాడులో జిల్లా అమరవీరుల స్మారక మందిరం వద్ద ఆదివారం ప్రజాసంఘాల నాయకులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పత్తిరి దానేసు, కోత ధర్మారావు, వంకల మాధవరావు, మద్దిల రామారావు, ఎం.వినోద్‌కుమార్‌ తదితరులు మాట్లాడుతూ పాలకుల విధానాలను ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు, నిర్బంధాలు విధించడం సరికాదన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు.కార్యక్రమంలో బోకర దుర్యోధనరావు, పుచ్చ దుర్యోధన, పోతనపల్లి కుసుమ, సాలిన వీరాస్వామి, లక్ష్మణ్‌, ప్రభాకర్‌, మన్మధరావు, తెప్పల అజయ్‌కుమార్‌, సోమనాధం, వైకుంఠరావు, జోగారావు, కుత్తుం దుష్యంతు, గేదెల జగదీష్‌ తదితరలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement