పోలాకి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పాలనలో వ్యాపారవర్గాలు ఉసూరుమంటున్నాయని, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ రాష్ట్ర కళింగవైశ్య విభాగం అధ్యక్షుడు పట్నాల శ్రీనివాసరావు (కోణార్క్ శ్రీను) అన్నారు. రాష్ట్రస్థాయి పదవి వచ్చిన సందర్భంగా కోణార్క్ శ్రీను ఆదివారం మబగాంలో ధర్మాన కృష్ణదాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వ్యాపారులు నుంచి పెద్ద వ్యాపారులు వరకు రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా లేరన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయలేక చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేయటంతో పేద, మధ్యతరగతి వర్గాల కొనుగోలు సామర్థ్యం పడిపోయిందన్నారు. కార్పొరేట్ సంస్థలు సైతం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటం లేదన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను ధర్మాన సోదరుల ఆశీస్సులతో సక్రమంగా నిర్వహించి, వచ్చే ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. కార్యక్రమంలో కళింగవైశ్య విభాగం జిల్లా అధ్యక్షుడు తంగుడు జోగారావు, జిల్లా వాణిజ్య విభా గం అధ్యక్షుడు కోరాడ చంద్రభూషణ గుప్తా, నియోజకవర్గ విభాగం అధ్యక్షుడు వైశ్యరాజు కేశవరాజు, సంఘ నాయకులు తంగుడు బాబి, పొ ట్నూరు సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


